Home Cinema Chiranjeevi : మనవరాలి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

Chiranjeevi : మనవరాలి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

chiranjeevi-talk-with-venu-swamy-about-his-granddaughter-mega-princess

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జూన్ 20వ తారీఖు నుంచి పండగ వాతావరణం నెలకొంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత కూతురు పుట్టడంతో.. మెగాస్టార్ చిరంజీవి తాత అయినందుకు ఆనందంతో పొంగిపోయి.. తన ఏకైక వారసుడు ( Chiranjeevi talk with Venu Swamy ) తండ్రి అయినందుకు మురిసిపోయి.. ఆయన అభిమానులతో మీడియాతో ఎంతో ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. ఉపాసన డెలివరీ తర్వాత రామ్ చరణ్, ఉపాసనని.. చిరంజీవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి.. అక్కడే ఉంచుకొని ప్రతిరోజు ఒక పండుగలా గడుపుతున్నారంట. ఇక అతి తొందరలోనే మెగా ప్రిన్సెస్ కి పేరు పెట్టాలని.. ఆ వేడుక ఎంతో ఘనంగా చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారంట.

chiranjeevi-talk-with-venu-swamy-about-his-granddaughter-mega-princess

అయితే మెగా ప్రిన్సెస్ కి చిరంజీవి ఎప్పుడు పేరు పెడతారా.. ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందా.. ఆ వేడుకకి ఎవరెవరు వస్తారు.. ఎంతమంది స్టార్స్ వస్తారు.. ఎలా ఎంజాయ్ చేస్తారు అనే దాన్ని చూడ్డం కోసం అతి సామాన్యమైన అభిమానితో పాటు అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆరోజు అతి తొందరలోనే ఉందని.. ఆ వేడుక ( Chiranjeevi talk with Venu Swamy ) ఎంతో ఘనంగా చేసే అభిప్రాయం ఉందని.. మెగా కుటుంబం నుంచి వినిపిస్తుంది. అయితే మనవరాలకి పేరు పెట్టక ముందే చిరంజీవి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అంట. మనవరాలు పేరు పెట్టడానికి ముందు ఆమె పూర్తి జాతకం గురించి తెలుసుకోవాలని.. ఆమె పూర్తి జాతకం రాయించాలని డిసైడ్ అయ్యారంట.

See also  Prabhas : మరోసారి ఆసుపత్రి పాలైన ప్రభాస్ అక్కడ సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

chiranjeevi-talk-with-venu-swamy-about-his-granddaughter-mega-princess

అయితే జాతకం అనగానే చిరంజీవికి వేణు స్వామి గుర్తుకు వచ్చారంట. వేణు స్వామిని పిలిపించి తన మనవరాలు జాతకం పూర్తిగా రాయమని చెప్పారని వార్తలు వస్తున్నాయి. అసలు వేణు స్వామి అంటే మొదట్లో ఎవరూ కూడా నమ్మేవారు కాదు. ఎందుకు ఇతను అడక్కుండానే సెలబ్రిటీస్ గురించి జాతకాలు చెప్తాడు అనుకుంటూ సోషల్ మీడియాలో ( Chiranjeevi talk with Venu Swamy ) కామెంట్లు చేసేవారు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వేణు స్వామిని పిలవడమేంటి.. అతన్ని ఆయన మనవరాలు గురించి జాతకం రాయబడడం ఏంటి.. అని ఎవరికి అర్థం కావడం లేదు. వేరుస్వామి ఆల్రెడీ మెగా ప్రిన్సెస్ జాతకం గురించి చెప్పడం జరిగింది. ఆమె మహా జాతకురాలని, చిరంజీవిని మించిన జాతకరాలవుతాదని, ఇంటికి గొప్ప పేరు తీసుకొస్తుందని ఆయన చెప్పడం జరిగింది.

See also  Suma Kanakala: పెద్ద బాంబే పేల్చింది సుమ..? “తప్పు నాది కాదు.. అయన చెప్తేనే అలా అడిగాను”

chiranjeevi-talk-with-venu-swamy-about-his-granddaughter-mega-princess

అయినా కూడా చిరంజీవి ఎందుకైనా మంచిది పూర్తిగా జాతకం చూపించి.. ఏమైనా దోషాలు, పూజలు, జపాలు చేయించాల్సి ఉంటే చేయించేద్దామని అన్ని రకాలుగా మనవరాలను సేఫ్ గా ఉంచుదామని ఆలోచించి.. వేణుస్వామికి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనగా మారి.. విపరీతంగా వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా వేణు స్వామిని నమ్మారా ? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే వేణుస్వామి చెప్పినవన్నీ ఇప్పటివరకు జరుగుతూనే ఉండడంతో.. అతనిపై కొంత నమ్మకం అయితే వస్తుంది. అందరూ కూడా ఆయన న్యూస్ అంటే ఆయన చెప్పిన జాతకం ఎవరి గురించి అని చెప్తే వెంటనే ఆత్రంగా చూస్తున్నారు. మొత్తానికి మనవరాలు పేరు పెట్టడానికి ముందే.. పూర్తి జాతకాన్ని, పేరు చేసుకుని దాన్ని బట్టి చూడాలని.. ఇంత బిజీలో కూడా చిరంజీవి ఆలోచిస్తున్నాడంటే.. నిజంగా ఆయన తాత హోదాను కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అర్థమవుతుంది.