
Chiranjeevi – Pawan Kalyan : మెగా కుటుంబంలో సీనియర్ హీరో.. అందరినీ అన్ని రకాలుగా చూసుకుంటూ కష్టపడి పైకి వచ్చిన హీరో.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఆధీనంలోనే ఒక్కొక్కరు వచ్చి.. ఆయన సలహాలు మేరకు వాళ్ల జీవితాల్ని హీరోలుగా మలుచుకొని అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్న మెగా హీరోలందరూ ( Chiranjeevi and Pawan Kalyan ) ఆయనకి కృతజ్ఞలే. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒకసారి పవన్ కళ్యాణ్ ని పిలిపించి చెడామడా వాయించారంట. ఇంతకీ ఎందుకు వాయించారో తెలుసుకుందాం.. సాధారణంగా సినిమాలంటే ఒక కొత్త కథని రాసి సినిమా చేయడం ఒక పద్ధతి. అలాగే ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలుని.. రైట్స్ కొనుక్కొని రీమేక్ చేసుకోవడం ఇంకొక పద్ధతి.
సాధారణంగా ఇతర భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు రీమేక్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటది. ఎందుకంటే ఈ కథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే భయం ఉండదు. ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ ( Chiranjeevi and Pawan Kalyan ) అవుతుందని నమ్మకంతో ఉంటారు. అలాగే చిరంజీవి ఠాగూర్ సినిమా ఇలా కొన్ని సినిమాలతో ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసి కూడా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రీమిక్స్ సినిమాలు చేసి చాలా సక్సెస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఒకసారి రజనీకాంత్ సినిమాని రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యాడంట. ఇంతకీ అది ఏం సినిమా అంటే.. భాష. ఆ రోజుల్లో భాషా సినిమా ఎంత పెద్ద సక్సెస్ను సాధించిందో మనందరికీ తెలిసిందే.
అప్పట్లోనే 38 కోట్లు సంపాదించిందా సినిమా అక్కడ నుంచి భాషా సినిమా నుంచి రజినీకాంత్ కి తెలుగులో కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ పెరిగింది. దానితో అప్పటినుంచి ఇప్పటివరకు రజినీకాంత్ సినిమా ఏది తమిళంలో రిలీజ్ అయిన అది తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంత పెద్ద సక్సెస్ అయిన భాషా ( Chiranjeevi and Pawan Kalyan ) సినిమాని కొంతకాలం తర్వాత పవన్ కళ్యాణ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు అంట. దానికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారంట. ఈ విషయం తెలిసి.. చిరంజీవి వెంటనే పవన్ కళ్యాణ్ పిలిపించి చెడమడ బాగా వాయించారంట. భాషా సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూసేశారు, బాగా ఎంజాయ్ చేసేసారు.
ఈ సినిమాని ఎవ్వరూ మరచిపోలేదు. ఎందుకంటే అంత సూపర్ హిట్ అయిన సినిమాని.. ఇండియాలో ఉన్న అన్ని భాషల వాళ్ళు ఆ సినిమాని ఆదరించేసి చూసేశారు. ఇప్పుడు అలాంటి సినిమాని మళ్లీ నువ్వు సేమ్ రీమేక్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని.. అన్ని రకాలుగా నష్టమని.. అసలు అలాంటి పని చేయొద్దని.. దానితో పోల్చుకుంటే ఇంకేది ఎవరికీ నచ్చదని.. బాగా చెప్పి తిట్టారట. దానితో ఇంక పవన్ కళ్యాణ్ చేసేదేమీ లేక మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అన్న చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అంగీకరించి ఆ సినిమా చేయాలనే ఆలోచననే వదిలేసాడంట. ఈ రకంగా చిరంజీవి సినిమా మీద ఒక అంచనాలను వేసుకొని తమ్ముడికి సలహా ఇచ్చి కాపాడారన్నమాట.