Home Cinema Chiranjeevi: నేను ఆ తప్పు చెయ్యడం వల్లే మా నాన్న నడి రోడ్డు పై వీధి...

Chiranjeevi: నేను ఆ తప్పు చెయ్యడం వల్లే మా నాన్న నడి రోడ్డు పై వీధి కుక్కను కొట్టినట్టు కొట్టాడు.??

Chiranjeevi Father: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగినటువంటి చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు, గౌరవ మర్యాదలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే.. ఎందుకంటే ఈయనకి ఇంతలా గుర్తింపు ఉండడానికి ముఖ్యమైన కారణం సినీ చిత్ర పరిశ్రమలో ఎవరి సహాయం లేకుండా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదగడమే.. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ గురించి మాటలు సరిపోవు..

chiranjeevi-father-beat-him-on-road-for-doing-that-mistake

ఈ విషయం పక్కన పెట్టినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక వార్త ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అదేంటంటే.. చిరంజీవి ఆ తప్పు చేయడం వల్ల వాళ్ళ నాన్న నడిరోడ్డుపై వీధి కుక్కను కొట్టినట్టు కొట్టాడట.. మరి ఆ తప్పేంటి.? ఎందుకు కొట్టాడు.? అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. అది చిరంజీవి ఆరో తరగతి చదువుతున్న రోజులు.. ఆ టైంలో ఓ రోజు ఎంబీఏ సంస్థ వారు రాము అనే చిత్రం విడుదల అయ్యింది. ఇక ఎప్పటి నుంచో సీనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అయిన చిరంజీవి ఎలాగైనా సరే ఈ సినిమా చూడాలని..

See also  Nagarjuna-Amala: ఆ స్టార్ నటుడు నాగార్జున కంటే ముందే అమలను అంతలా ప్రేమించాడా.??

chiranjeevi-father-beat-him-on-road-for-doing-that-mistake

నెల్లూరులోని కనకమహాల్ థియేటర్లోకి ఫస్ట్ షో కి వెళ్ళాడట చిరు.. కానీ అప్పుడు చిరంజీవి వయసు 11 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక సినిమా అయిపోయి చిరంజీవి గారు థియేటర్ నుంచి బయటికి వచ్చాడట. ఇక అప్పట్లో ఎన్టీఆర్ సినిమా విడుదల అంటే నానా హంగామా ఉండేది. ఆ రోజు థియేటర్ ఎంతో రద్దీగా కిటకిటలాడుతుందట ఇక రద్దీలో తోపులాటలు కూడా జరిగాయి. దాంతో హుటా హుటిన పోలీస్ బృందం అక్కడికి చేరుకుందట.. మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారి తండ్రి కానిస్టేబుల్..

See also  Avika Gor: ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా ఏడుసార్లు నన్ను అలా చేసారంటూ అవికా గోర్ సంచలన విషయాలు వెల్లడించింది

chiranjeevi-father-beat-him-on-road-for-doing-that-mistake

కాబట్టి ఆయన కూడా అక్కడికి వచ్చారట. తోపులాటలో చిరంజీవి ఇరుక్కున్నాడు అన్న సంగతి గమనించిన చిరంజీవి తండ్రి (Chiranjeevi Father) కనకమహాల్ థియేటర్ నుంచి మూసాపేట వరకు కొబ్బరి మట్ట చీరి మరి బాదుకుంటూ వెళ్ళాడట. ఇక ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని.. అలా చిరంజీవి ఏదైనా చేయరాని తప్పు చేస్తే ఆయనకి పట్టరాని కోపం వచ్చి అసలు ఊరుకునేవారు కాదట. అలా ఆరోజు చిరంజీవి చేసిన తప్పుకి నడి రోడ్డు పైనే వీధి కుక్కను కొట్టినట్టు కొట్టారట ఆయన నాన్నగారు.. ఇక ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి గారే ఓ చిత్రం యొక్క ఫ్రీ ఈవెంట్ రిలీజ్ సందర్భంగా ఆయన తెలిపారు.