Home Cinema Chiranjeevi – Tamannaah : తమన్నా కెమెరా వెనక ఏం చేసిందో సీక్రెట్ బయట పెట్టిన...

Chiranjeevi – Tamannaah : తమన్నా కెమెరా వెనక ఏం చేసిందో సీక్రెట్ బయట పెట్టిన చిరంజీవి..

chiranjeevi-comments-on-tamannaah-about-bhola-shankar-shooting-details

Chiranjeevi – Tamannaah : ఈ ఏడాది పండుగలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ ఏజ్ లో కూడా చిరంజీవి కుర్ర హీరోలతో పోటీపడుతున్న సంగతి మనందరికీ తెలుస్తూనే ఉంది. సూపర్ హిట్ అయిన వాల్తేరు వేరే సినిమా తర్వాత మెగాస్టార్ ( Chiranjeevi comments on Tamannaah ) చిరంజీవి చేస్తున్న సినిమా బోలా శంకర్. ఈ సినిమా తమిళ్ లో వేదాళం సినిమాగా వచ్చింది. తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే సినిమాని ఇప్పుడు తెలుగులో భోళాశంకర్ గా తీశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా బోళాశంకర్.

chiranjeevi-comments-on-tamannaah-about-bhola-shankar-shooting-details

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా నిన్న హైదరాబాద్లో జరుపుకుంది. ఈ ఫంక్షన్ కు ఎందరో దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కు విచ్చేసిన చిరంజీవి, కీర్తి సురేష్ లు ఎంతో ఆనందంగా అభిమానులతో వాళ్ళ ( Chiranjeevi comments on Tamannaah ) అనుభవాలను పంచుకున్నారు. అలాగే నిర్మాత అల్లు అరవింద్ కూడా.. మీరందరూ చిరంజీవి సినిమాలు చూసి పైకొస్తే.. నేను చిరంజీవితో సినిమాలు చేసి పైకొచ్చానని గర్వంగా చెప్పుకున్నారు. ఇలా అందరూ ఎవరి అనుభవాలను వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవి కూడా అభిమానులు చూసి మీ అభిమానమే నాకు ధైర్యం, కృషి, పట్టుదల అన్నిటినీ ఇస్తుందని చెప్పుకొచ్చారు.

See also  Pawan Kalyan: రెబల్ స్టార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవర్ స్టార్.. ఎంతో తెలుసా.?

chiranjeevi-comments-on-tamannaah-about-bhola-shankar-shooting-details

అలాగే భోళాశంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత.. ఈ సినిమా ప్రమోషన్లలో సినిమా చిత్ర బృందం చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం చిరంజీవి అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలో తనతో హీరోయిన్గా నటించిన ( Chiranjeevi comments on Tamannaah ) తమన్నా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. తమన్నా నాకు చాలా ఇష్టమని.. తనకు సినిమా అంటే చాలా ప్రేమ అని.. తన పని అంటే తనకి చాలా గౌరవం అని.. అందుకే తమన్నాను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్ లో ఒక పాటను చిత్రీకరించారు.

See also  Chay and Sam: పాపం చైతూ..సమంతతో డివోర్స్ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడంట.. అసలు నిజా నిజాలు వెలుగులోకి..

chiranjeevi-comments-on-tamannaah-about-bhola-shankar-shooting-details

ఆ సమయంలో తమన్నా తండ్రికి సర్జరీ జరిగిందని.. అయితే తన తండ్రికి సర్జరీ జరిగింది అని తెలిసి కూడా.. తాను షూటింగ్ స్పాట్ ని వదిలి వెళ్ళకుండా.. అక్కడ పూర్తిగా కంప్లీట్ చేసే వరకు ఉందని చెప్పారు. కెమెరా ముందు చక్కగా డాన్స్ చేస్తూ నటించి.. తర్వాత కెమెరా వెనక్కి వెళ్లి తన తండ్రికి ఎలా ఉందని ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి అడిగేది.. ధైర్యంగా ఉండమని చెప్తూ తాను అక్కడ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తానని.. అక్కడ అన్ని పనులు చూసుకోమని ఇంట్లో వాళ్లకి ధైర్యం చెబుతూ ఉండేది. కెమెరా ముందు ఎంత డాన్స్ ఎంత బాగున్నా.. కెమెరా వెనక్కి వెళ్లి తన తండ్రి గురించి చాలా బాధపడేది. అయినా కూడా షూటింగ్ టైం లో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటూ బాగా చేసేది. సినిమా మీద ప్రేమతో ఇంత కష్టపడుతున్న తమన్నా ను చూసి నాకు చాలా గర్వంగా అనిపించిందని చిరంజీవి చెప్పుకుంటూ వచ్చారు.