
Chiranjeevi – Balakrishna : నందమూరి కుటుంబంలో ఇప్పటికి పెద్దగా బాలకృష్ణ.. అలాగే మెగా కుటుంబంలో ఇప్పటికి పెద్దగా చిరంజీవి కొనసాగుతున్నారు. ఈ రెండు కుటుంబాల్లో వీళ్లిద్దరు అంటే వాళ్లకు చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళ వంశ ప్రతిష్టను నిలబట్టేందుకు వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి కెరియర్లో ముందుకు వెళుతూ.. బాటలు ( Chiranjeevi and Balakrishna have a common point ) వేస్తున్నారు. ఇదే క్రమంలో చిరంజీవికి, బాలకృష్ణకి పర్సనల్గా ఎన్నో గొడవలు ఉన్నాయని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి కానీ.. అందులో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ.. వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ దగ్గర ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటూనే ఉంటుంది.
ఆరు పదులు దాటినా కూడా వీళ్ళిద్దరూ ఇప్పటికీ ఎనర్జీని వదలలేదు. వాళ్ళకి సినిమాలు పై ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకోలేదు. ఈరోజుకి కూడా ఈ తరానికి పోటీగా నిలబడుతూ ఒక్కొక్క సినిమానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టిస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి ఎంతోమంది హీరోలు, సామాన్య మానవులు కూడా ఎన్నో నేర్చుకోవాలి. ఈ ( Chiranjeevi and Balakrishna have a common point ) వయసు వచ్చినా కూడా పోరాటం అనేది ఆపకూడదని తన పనిని తాను ఎంతో ఇష్టంగా ప్రేమించాలని.. అదే ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంతృప్తిని, గౌరవాన్ని ఇస్తుందని వీళ్ళిద్దరిని చూస్తేనే అర్థమవుతుంది. అసలు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ అవ్వడానికి వెనుక.. వీళ్ళిద్దరికీ కామన్ గా ఉండే ఒక పాయింట్ ఉందని అంటున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళిద్దరూ కెరీర్ లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా అదృష్ట జాతకులని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా భార్యల విషయంలో వీళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులని అనుకుంటున్నారు. బాలకృష్ణ గారి భార్య ( Chiranjeevi and Balakrishna have a common point ) వసుంధర దేవి చాలా మంచిదని.. బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి మొత్తాన్ని వసుంధర దేవి చూసుకుంటుందని.. బాలయ్య మనస్తత్వం తెలుసుకొని ఆయనకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ కుటుంబంలో అందరినీ చూసుకుంటూ ఎంతో సౌమ్యంగా సంసారాన్ని సాగిస్తుందని.. అందుకే బాలకృష్ణ అంత సక్సెస్ అయ్యాడు అని అనుకుంటున్నారు.
ఇక చిరంజీవి భార్య సురేఖ గారి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి కొణిదల వారి కుటుంబంలో అడుగుపెట్టి.. ఒక సామాన్యమైన కుటుంబం ఇది అని అత్తోరిని ఎప్పుడూ కూడా చులకనగా చూడకుండా.. తన అత్తగారిని, మామ గారిని, మరుదుల్ని, ఆడపడుచుల్ని అందరినీ చేరదీసుకుని.. అందరి దగ్గర తానే మన్ననలను పొందుకొని.. వాళ్ళ అన్నతో ఏం చెప్పాలనుకున్నా కూడా వదినతో చెప్తేనే బాగుంటుందని అనిపించేంత చక్కగా చనువుగా అందరిని చూసుకుంటూ.. చిరంజీవికి కుటుంబ సమస్య, టెన్షన్స్ ఏమీ ఇవ్వకుండా అన్ని ఆమె చూసుకుని రావడం వలన చిరంజీవి అంత సక్సెస్ పొందాడని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి చిరు, బాలయ్యలకు ఒకే లాంటి అదృష్టం పట్టిందని అనుకుంటున్నారు అందరు..