
Chandra Mohan: ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం చనిపోయారన్న కబురు తెలిసిన దగ్గర నుంచి సినీ పరిశ్రమ అంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఎన్నోఏళ్లగా చంద్రమోహన్ ఎన్నో సినిమాల్లో నటించి ( Chandra Mohan last speech ) తెలుగు సినీ అభిమానుల మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. చంద్రమోహన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నటుడిగా మాత్రమే కాకుండా చంద్రమోహన్ ఒక వ్యక్తిగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. అలాంటి చంద్రమోహన్ ఇంక లేరు అంటే సినీ అభిమానులు అందరూ బాధపడుతున్నారు.
చంద్రమోహన్ ఇన్నేళ్లు పాటు నటుడుగా దగ్గర దగ్గర 1000 సినిమాల వరకు నటించిన ఆయన చివరి కాలంలో ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంపాదించిన దానికంటే నేను పోగొట్టుకున్నదే ( Chandra Mohan last speech ) ఎక్కువ ఉందని ఎంతో బాధగా చెప్పారు. చంద్రమోహన్ సంపాదించిన దానితో స్థలాలను, ఆస్తులను కొని.. మళ్లీ వాటిని చూసుకోవడానికి ఎవరూ లేరు అంటూ వాటిని అమ్మేయడం జరిగింది. అలా అమ్మేసుకున్న ఆస్తులు 100 కోట్ల దగ్గర ఉంటాదని.. అదంతా నేను పోగొట్టుకున్నట్టే అని ఆయన ఎంతో బాధగా చెప్పుకోవడం జరిగింది.
అయితే ఈ ఏడాది కళాతపస్వి కే విశ్వనాధ్ చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రమోహన్ కు కె విశ్వనాథ్ గారు స్వయంగా పెదనాన్న కొడుకు. అంటే చంద్రమోహన్ కి అన్నయ్య అవుతారు. చంద్రమోహన్.. కె విశ్వనాథ్ చనిపోయినప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. కె విశ్వనాథ్ పెదనాన్న ( Chandra Mohan last speech ) కొడుకు, ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా నా కజిన్ మా మధ్య సినిమా బంధం కంటే మా పర్సనల్ బంధాలే ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు. బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు నా ఎడమ చేయి పోయినట్టు అయ్యింది. అన్నయ్య చనిపోతే ఇప్పుడు నా కుడిచేయి పోయినట్టు అయింది అంటూ ఆయన ఎంతో ఏడ్చారు.
కె విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాస్ లో ఒకే చాట స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని పాతికేళ్ళు పాటు పక్కపక్కనే ఉన్నామని అని చెప్పుకొచ్చారు. అన్నయ్యది నాది ఎంతో చక్కటి బంధమని, ఆయన నన్ను హీరోగా నాలో మంచి నటన ప్రతిభని ప్రేక్షకులకు చూపించిన గొప్ప దర్శకుడుని, కె విశ్వనాథ్ లాంటి వ్యక్తి తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడని, ఆయన తెలుగు సాంప్రదాయాల్ని, తెలుగు కట్టుబాట్లని ఎంతో చక్కగా చూపించిన దర్శకుడని కొనియాడారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడిగా, కె. విశ్వనాధ్ దర్శకుడిగా , నేను నటుడిగా 1966లో పరిచయమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. మా బంధం ఎంతో అద్భుతమైనదని చెప్పుకొచ్చారు. చంద్రమోహన్ బహుశా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన ఆఖరి మాటలు ఇవే. ఇప్పుడు ఆ మాటలు వింటూ లేని చంద్రమోహన్ ను ఆఖరిసారిగా చూస్తూ అభిమానులు కన్నీరు కారుస్తున్నారు.