Samantha : ఏ రంగంలోనైనా ఏ మనిషి ఎప్పుడు పాపులర్ అవుతాడో.. అందరూ ఆ వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు అనే దాని గురించి చెప్పలేము. ఒక్కొక్కరు వాళ్ళు సాధించిన సక్సెస్ వలన పేరు ప్రఖ్యాతలు తెలిపితే.. కొందరు చేసే తప్పుల వలన తెలిసి తెలియక చేసిన బిహేవియర్ వలన కూడా పాపులర్ అవుతారు. అలాగే ( Samantha and Pritham Jukalkar ) సమంత స్టైలిస్ట్ ప్రీతం జుక్కల్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇతను ఎవరో ఒక ఏడాది క్రితం వరకు ఎవరికీ తెలియదు. తెలుసుకునేంత పాపులర్ కూడా కాదు కానీ.. గత ఏడాది నించి ఇతని పేరు ఒక్కొక్కరి నోటికి వస్తుంది. ఇప్పుడు చివరికి భయంకరంగా అందరి కామెంట్స్ ని ఎదుర్కోవలసివస్తున్న పరిస్థితుల్లో ఉన్నాడు.
అసలు విషయం ఏమిటంటే.. సమంత నాగచైతన్య ఇద్దరు కొంతకాలం ప్రేమించుకుని ఎంతో వైభవంగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళ ఇద్దరి జంట అంటే సినిమా రంగంలో అటు అక్కినేని కుటుంబంలో అందరికీ కూడా.. సినీ అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. అలాంటి జంట అనుకోకుండా విడిపోయింది. విడిపోవడానికి కారణాలు ఎన్నిసార్లు ఎందరో ఏమిటని అడిగినా కూడా సరైన రీజన్ ( Samantha and Pritham Jukalkar ) నాగచైతన్య గాని, సమంత గాని చెప్పలేదు. అయితే ఇన్నాళ్లకు అసలు నిజం ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత స్టైలిష్ ప్రీతం కారణంగానే సమంత నాగచైతన్య విడిపోయారని వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ వార్తల్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. తర్వాత నెమ్మదిగా సమంత తన స్టైలిస్ట్ ప్రీతం కలిసి తీసుకున్న ఫొటోస్ చూసి అందరిలో కొంత అనుమానం రేజయింది.
సమంత ప్రీతం జుక్కల్కర్ తో అంత చనువుగా ఉండడం.. వాళ్ళిద్దరు వ్యవహారం నచ్చకే నాగచైతన్య సమంతకు దూరం అయ్యాడని అందరూ అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. అసలు సమంత స్థాయికి ఒక స్టైలిస్ట్ ప్రీతం ఎందుకు అంత చనువుగా ఉంటుంది? అని ఎందరో అనుకునేవారు. ఇటీవల ( Samantha and Pritham Jukalkar ) ప్రీతమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా అతనికి అతని మాటలకి ట్రోల్ కూడా చేస్తున్నారు. ప్రీతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత నాకు అక్క లాంటిదే.. ఆమె నాకు ఆఫర్ ఇచ్చింది. నేను హీరోయిన్స్ కి ఎందుకు స్టైలిస్ట్ గా ఉంటానంటే.. ఏదైనా ఎక్స్పరిమెంట్ కి హీరోలు తొందరగా ఒప్పుకోరు, హీరోయిన్స్ అయితే కొత్త కొత్తగా రెడీ అవుతారు, కొత్త ఎక్స్పరిమెంట్లు చేస్తారు.
కాబట్టి నేను హీరోయిన్స్ కి స్టైలిస్ట్ గా వచ్చాను తప్ప.. ఇంక నేనే అలాంటి వాడిని కాదని.. నాకు సమంతకు ఎలాంటి సంబంధం లేదని.. నాకు ఆమె అక్కతో సమానం అని అన్నాడు. దానితో నెటిజనులు, నాగచైతన్య అభిమానులు సమంత ప్రీతం కలిసి ఉన్న ఫొటోస్ ని పెట్టి.. మీ అక్క చెల్లెలుతో ఇలాగే బిహేవ్ చేస్తావా? ఇలాగే ఉంటావా? అనుకుంటూ నానా తిట్లు తిడుతున్నారు బంగారం లాంటి జంట విడిపోవడానికి కారణం నువ్వైతే మాత్రం ఆ దేవుడు కూడా క్షమించడు అంటూ అనేక రకాలుగా తిడుతున్నారు. చైతు సమంతలు ఇద్దరూ విడిపోవడానికి రీజన్ ప్రీతం అయితే మాత్రం.. చివరికి ఇలా పబ్లిక్ గా అందరితోనూ మాటలు పడాల్సిన గతి చివరికి వచ్చిందని నెటిజనులు వాపోతున్నారు.