Chaitanya Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ కూడా ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగువారి గుండెల్లో సీనియర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన వృక్షాం ఎదిగి ఎందరో వారసులని ( Chaitanya Krishna comments about the Nandamuri family ) ఆ వంశం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పటికీ తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో అభిమానం.ఆయన తర్వాత ఆయన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ , జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఇలా చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగువారి అభిమానాన్ని అందుకున్నారు.
అలాగే నందమూరి వంశంలో మరొకరు చైతన్య కృష్ణ. ఇతను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కానీ వచ్చిన కొత్తలోనే సినిమా సక్సెస్ కాక సినిమా ప్రపంచానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. సీనియర్ ( Chaitanya Krishna comments about the Nandamuri family ) ఎన్టీఆర్ రెండో కొడుకు జయ కృష్ణ కొడుకు చైతన్య కృష్ణ. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్రీత్ అనే సినిమాలో ఇతను మళ్లీ నటించాడు.ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన రిలీజ్ అవుతుంది. అలాగే ఇతను కొన్ని వెబ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. బ్రీత్ అనే సినిమా డిసెంబర్ 2 వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్ కోసం చైతన్యకృష్ణ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు.
చైతన్య కృష్ణ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్ అనేక ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అందులో సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అడగ్గా.. ఆ సినిమా గురించి అనేక విషయాలను చైతన్య కృష్ణ పంచుకున్నారు. అలాగే సినిమా గురించి కాకుండా అతని పర్సనల్ విషయాల గురించి కూడా యాంకర్ ( Chaitanya Krishna comments about the Nandamuri family )అడగడం మొదలు పెట్టింది. అందులో ముఖ్యమైన ప్రశ్న మీ ఫ్యామిలీలో వరస మరణాలకి కారణం ఏమైనా శాపం ఉంటుందా అని అడిగింది.శాపం అనే మాట పక్కన పెట్టండి గానీ.. ఈ భూ ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎన్నో ట్రాజడీలు జరుగుతూ ఉంటాయి. అలాగే మా కుటుంబంలో కూడా జరగకూడదనేమి రూల్ లేదు కదా. మాకు కుటుంబంలో జరిగిన మరణాలకు మేము అందరం ఎంతో బాధ పడుతున్నాము.
ముఖ్యంగా తారకరత్న మరణాన్ని అంతవరకు మర్చిపోలేక పోతున్నాము. తారకరత్న చాలా మంచి మనిషి. అతనికి డ్రైవింగ్ నేర్పింది నేనే. అతనికి ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండదు. నందమూరి కుటుంబాన్ని, వాళ్ళ వారసత్వాన్ని, వాళ్ళ పేరుని ఎక్కడా కూడా వాడాలని అనుకోడు.. చాలా సింపుల్ గా ఉండే మనిషి. ప్రతి మనిషికి గౌరవం ఇచ్చే మనిషి అంటూ తారకరత్న గురించి అనేక విషయాలు చెబుతూ చైతన్య కృష్ణ ఎంతో బాధపడ్డాడు. ఏదేమైనా తారకరత్న లాంటి మంచి వ్యక్తి చనిపోవడం వాళ్ల కుటుంబానికి నిజంగా తీరనిలోటు అని నందమూరి అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు.