Pawan kalyan : మనిషి జీవితం అన్న తర్వాత ఎంతటి వారికైనా గెలుపు, ఓటములనేవి తప్పువు. ఒక్కొక్కసారి సక్సెస్ మన తలుపుని తట్టి మనకెంతో ఆనందాన్ని ఇస్తే.. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ మన దగ్గరకు వచ్చి మనకు ( Pawan Kalyan disaster movies ) ఎన్నో నేర్పి వెళ్తాది. రెండూ మన జీవితంలో చాలా ముఖ్యమైనవే. ఒకటి ఆనందాన్ని ఇస్తే, ఇంకొకటి అనుభవాన్ని ఇస్తుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఎవరు అంటే అందులో పవన్ కళ్యాణ్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. పైగా ఆయనకున్న క్రేజ్.. ఒక రకమైన స్పెషల్ క్రేజ్ ఇంకే హీరోకి లేదనే చెప్పుకోవాలి. అంత స్పెషల్ క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
అంతటి స్పెషల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా.. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి కూడా.. ఫెయిల్యూర్స్ అనేవి తప్పలేదు. ఇక సక్సెస్ విషయానికొస్తే ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టే స్టార్ హీరో అయ్యాడు. ఇంతమంది ( Pawan Kalyan disaster movies ) ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ లో డిజాస్టర్ గా మిగిలిన సినిమాల లిస్టు ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ జీవితంలో పెద్ద డిజాస్టర్ గా మిగిలిన సినిమా జానీ. ఈ సినిమాకి దర్శకత్వం కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అందుకే ఈ డిజాస్టర్ డబల్ డిజాస్టర్ కింద లెక్క. అలాగే ఆయన కెరీర్లో పంజా సినిమా కూడా గట్టిగానే డిజాస్టర్ గా మిగిలింది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా పులి. కానీ అంచనాలు అన్నిటికీ విరుద్ధంగా వెళ్లి.. డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా. అలాగే హిందీలో లవ్ ఆజ్ కల్ సినిమా మంచి సక్సెస్ను సాధించింది. ఆ స్టోరీ యూత్ ని చాలా ఎట్రాక్ట్ కూడా చేసుకుంది. అలాంటి సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా ( Pawan Kalyan disaster movies ) తీన్మార్ సినిమా తీశారు. ఈ సినిమాపై కూడా పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అప్పుడు. కానీ ఇది కూడా వాళ్ళ ఆసన్న నిరాశలు చేసింది. ఈ సినిమా పెద్దగా ఊహించినంతగా రిజల్ట్ ఇవ్వలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే.. అదే పేరును ఉపయోగించి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దాని సీక్వెల్ తీశారు కానీ.. అది పరమ డిజాస్టర్ గా మిగిలింది.
ఇక పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు, గురూజీ కింద చూసుకునే వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ అని అందరూ ఫిక్స్ అయిపోతారు. అలాంటి భారీ అంచనాలతో అజ్ఞాతవాసి సినిమా తీయడం జరిగింది. కానీ ఈ సినిమా కూడా దారుణమైన డిజాస్టర్ గా కెరియర్లో మిగిలిపోయింది. ఇలా ఎంతో టాప్ హీరో అయినా పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా డిజాస్టర్ సినిమాలు తప్పలేదు. అలాగే ప్రతి హీరో కెరీర్ లో కూడా సక్సెస్ లో ఫెయిల్యూర్లు అనేవి ఉంటాయి. ఆ రెండూ మిశ్రమం అయితేనే దాన్ని లైఫ్ అని, కెరీర్ అని అంటారు. కానీ ఎన్ని డిజాస్టర్లు వచ్చినా పవన్ కళ్యాణ్ లో మాత్రం ఎటువంటి మార్పు రాకపోగా.. ఆయన అభిమానుల అభిమానించే విధానంలో కూడా ఎక్కడా తేడా రాదు. అదే ఆయన గొప్పతనం.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే..