Home Cinema Bellamkonda Srinivas: రష్మిక తో ఎఫైర్ గురించి కుండ బద్దలు కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్…

Bellamkonda Srinivas: రష్మిక తో ఎఫైర్ గురించి కుండ బద్దలు కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్…

Bellam konda Sreenivas: మనందరికీ తెలిసిన విషయమే.. మీడియా వాళ్ళు అలాగే ట్రోలర్స్ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన దాన్ని వదలరు. దానిపై పదే పదే కావాలనే నెట్టింట రచ్చ చేస్తూ విమర్శల వర్షాన్ని కురిపిస్తూ ట్రోల్ కి గురి చేస్తూ ఉంటారు. ఇక అలాంటి విషయమే నెట్టింట ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ రష్మిక మందనల ప్రేమ వ్యవహారం.. ఇక వీళ్లిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు రావడం మొదలయ్యాయి.

bellam-konda-sreenivas-secretly-dating-actress-rashmika-mandanna

ఇటీవల జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో వీధిద్దరు చాలా చనువుగా కనిపించాడట.. దాంతో ఇంకేముంది వీళ్లిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుందని అంటూ రచ్చ మొదలు పెట్టేశారు.. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ బాయ్ ఫ్రెండ్ అంటూ నానా రచ్చ చేసిన వీళ్లే ప్రస్తుతం ఆయనకు బ్రేకప్ చెప్పి బెల్లంకొండను తగులుకుందా అంటూ రకరకాల వార్తలు పుట్టిస్తున్నారు..ఇలా ఈ వార్తలు రావడం మొదలయ్యాయో లేదో అలా వీళ్లిద్దరు ముంబై ఎయిర్ పోర్ట్ లో పలు సార్లు కలిసి జంటగా కనిపించారు. దాంతో ఇంకేముంది వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారంటూ బలంగా ప్రచారం సాగింది.

See also  Pawan Kalyan : దానికి పవన్ కళ్యాణ్ నో అంటే.. చిరు నాగబాబులు ఎం చేశారో తెలుసా?

bellam-konda-sreenivas-secretly-dating-actress-rashmika-mandanna

అయితే ఇటీవలే ఈ విషయంపై బెల్లంకొండ బద్దలు కొట్టినట్టు సమాధానం తెలిపాడు. ప్రస్తుతం ఈయన చత్రపతి హిందీ రీమేక్ ప్రమోషన్లు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం నార్త్ లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో ఈ మూవీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఇలా పాల్గొన్న ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక తో లవ్ ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలను ఖండించాడు. మేమిద్దరం కలుసుకోవడమే చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అలాంటిది మీరందరూ ఏకంగా మేమిద్దరం డేటింగ్ చేస్తున్నామని పుకార్లు పుట్టించేశారు.

See also  Actress Anupama: ఆగలేకపోతున్నాను అంటున్న అనుపమ.. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్.. ఆడుకుంటున్న అభిమానులు..

bellam-konda-sreenivas-secretly-dating-actress-rashmika-mandanna

మేమిద్దరం ప్రేమలో ఉన్నామనేది పచ్చి అబద్ధం మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ తెలిపాడు. మా ఇద్దరి వృత్తిరీత్యా తరచూ హైదరాబాద్ నుండి ముంబై వెళ్లాల్సి వస్తుంది తప్ప మరే విషయం లేదు. అయినా మేమిద్దరం కలిసి ఇంతవరకు ఎప్పుడూ ప్రయాణించలేదు. కేవలం ఎయిర్ పోర్ట్ లో మాత్రమే ఒకరిని ఒకరు వెదురుపడ్డాం. అందులో భాగంగానే ఒకటి రెండుసార్లు మీడియాకు కనిపించామంటూ బెల్లంకొండ (Bellam konda Sreenivas) పూర్తి వివరాలు చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు. దాంతో నెట్టింట జరుగుతున్న రచ్చకు ఓ పెద్ద పులిస్టాప్ పెట్టేసాడు.