Home Cinema Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఊహించని వార్త వెలుగులోకి!

Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఊహించని వార్త వెలుగులోకి!

because-of-this-reason-prabhas-has-not-married-yet

Prabhas : పాన్ ఇండియా స్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారి పరిచయమై.. ఘన విజయాన్ని సాధించిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి సినిమాతో అమాంతం ( Prabhas has not married yet ) ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని పెంచుకున్న హీరో ప్రభాస్. అయితే ఇంత పెద్ద స్టార్ హీరో ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి ప్రభాస్ పెళ్లి మీద ఎందరో ఎన్నోసార్లు కామెంట్స్ చేసుకోవడమే కాకుండా.. అనేక వార్తలు ప్రచారాల్లోకి కూడా వచ్చాయి. ప్రభాస్ – అనుష్క, ప్రభాస్ – త్రిష, అలాగే ఇటీవల ప్రభాస్ – కృతిసన ప్రేమలో ఉన్నారని ఎన్నోసార్లు వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్స్ మాత్రమే అని నిరూపించబడ్డాయి.

because-of-this-reason-prabhas-has-not-married-yet

ఎందుకంటే ఇంతవరకు ప్రభాస్ ఎవరినీ పెళ్లి చేసుకుంటున్నట్టుగానీ, ప్రేమిస్తున్నట్టుగానీ ఎలాంటి వార్తని అఫీషియల్ గా చెప్పలేదు. ఎన్నిసార్లు ప్రభాస్ ని తన పెళ్లి గురించి ఎందరో అడిగినా నవ్వుతూ దాన్ని దాటించేస్తాడే తప్పా.. నలభై ఏళ్లు వస్తున్నా కూడా ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్టుగానీ, ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం గానీ కనిపించడం లేదు. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటి అనేది తెలియదు కానీ.. దీని గురించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ జాతకంలో ఏదో లోపం ఉందని దానివల్లనే ప్రభాస్ కి పెళ్లి జరగడం లేదని ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసినా కూడా ఆ జంట ఎంతో కాలం కలిసి ఉండదని వాళ్ళ కుటుంబానికి బాగా కావాల్సిన ఒక జ్యోతిష్యుడు ఇలా చెప్పాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

See also  Adivi Sesh-Supriya: కారులో అలా చేస్తూ మరొక సారి కెమరాలకు అడ్డంగా బుక్కైన అడవి శేష్ - సుప్రియ..

because-of-this-reason-prabhas-has-not-married-yet

అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని అంటున్నారు. ఈ వార్తలో ఎంతో నిజముందో తెలియదు గానీ, ఇంకా ఈ రోజుల్లో జ్యోతిష్యాన్ని నమ్మి.. అది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోకుండా మానేయడం అనేది నమ్మశక్యంగా లేదు. ఎన్నో ఏళ్లగా ప్రభాస్ పెళ్లి వార్త గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇలా ఊహించని ప్రచారాలు, వార్తలు వెలుగులోకి వస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని, బాధని కలిగిస్తుందని అభిమానులు ( Prabhas has not married yet ) వాపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ ట్రైలర్ సినీ అభిమానులందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్ అభిమానులు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడమే కాకుండా ఆ శ్రీరాముని రూపంలో ప్రభాస్ ని చూసి ఎంత బాగా చూడచక్కగా ఉన్నాడని ఆనందంతో మురిసిపోతున్నారు.

See also  Chiranjeevi - Ram Charan : మెగా ప్రిన్సెస్ కోసం చిరు చరణ్ లు రహస్యంగా.. ఉపాసన ఊరుకుందా?

because-of-this-reason-prabhas-has-not-married-yet

శ్రీరాముడిగా ప్రభాస్ మాట కూడా సూట్ అవ్వడం.. ట్రైలర్లో ఒక్కొక్క డైలాగ్ ఎంతో స్పష్టతని చేకూర్చుకుని ఉండడం వలన ఆది పురుష్ ట్రైలర్ పై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే.. యుద్ధానికి సంబంధించిన సంఘటనలు సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరించారని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ ( Prabhas has not married yet ) భగవంతుడి రూపంలో ప్రేక్షకులను, అభిమానుల్ని అలరించడానికి, అద్భుతమైన మంచి కంటెంట్ ని ఈ తరానికి అందించడానికి ముందుకు వస్తున్న ప్రభాస్ ని ఆ దేవుడు దీవించి.. అతి తొందరలో చక్కటి అమ్మాయితో పెళ్లి జరగాలని ప్రభాస్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి వీళ్ళ కోరిక అతి తొందరలో తీరుతుందేమో చూద్దాం..