Bandla Ganesh : బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గట్టి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇతను సినిమాల్లో నటుడుగా అయితే పెద్ద స్థాయి కి వెళ్లకపోయినా.. నిర్మాతగా సినిమా రంగంలో ( Bandla Ganesh sensational comments ) ఉన్న ప్రముఖులతో పరిచయాలు పట్ల విషయంలో ఇతను పెద్ద స్థాయిలోనే ఉన్నట్టు లెక్క. ముఖ్యంగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా దగ్గర ఆప్తుడు అని అందరూ అంటారు. అలాగే బండ్ల గణేష్ కూడా ఎప్పటికప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అతనికున్న అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరి స్నేహం చాలా గట్టిగానే ఉంటుందని అందరికీ గట్టి నమ్మకం. అయితే అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ అయితే మరొకవైపు ఆయనకి బాగా ఆప్తుడు అంటే త్రివిక్రమ్ అని చెప్పుకుంటారు.
త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్నా.. త్రివిక్రమ్ సలహాలను, సూచనలను అడుగుతాడని.. వాటిని కచ్చితంగా ఎంతో కొంత పాటిస్తాడని అందరూ అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో ఎక్కువ బ్లాక్ బస్టర్ రికార్డ్స్ కూడా విక్రమ్ తో ( Bandla Ganesh sensational comments ) అనే చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఇద్దరి బంధం స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఒకే వ్యక్తితో ఇద్దరు మనుషులు ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరు మనుషులు కి ఒకరంటే ఒకరు పడకపోవడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది. అలాగే బండ్ల గణేష్ కి త్రివిక్రమ్ కి కూడా పడదని కొందరు అంటూ ఉంటారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి బండ్ల గణేష్ ని త్రివిక్రమ్ రానివ్వలేదని..
అందువలనే బండ్ల గణేష్ కి అప్పటినుంచి త్రివిక్రంపై విపరీతమైన కోపం ఉందని.. వాళ్ళిద్దరికీ పడట్లేదని ప్రచారాలు గట్టిగానే వచ్చాయి. అయితే అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. కొద్దిరోజులకి వీళ్ళిద్దరూ సద్దుమణిగిపోయారు.. ఒకరి మీద ఒకరు అభిమానం రాకపోయినా, కోపాన్ని మర్చిపోయి ఉంటారు అని అందరూ ( Bandla Ganesh sensational comments ) సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గట్టిగానే యుద్ధం జరుగుతుందని అర్థమవుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కి ఒక అభిమాని నిర్మాత అవ్వాలనుకుంటున్నాను సార్ అని కామెంట్ పెట్టాడు. బండ్ల గణేష్ దానికి సమాధానం ఇస్తూ.. గురూజీకి ఒక ఖరీదైన గిఫ్ట్ ఏదైనా పట్టుకొని వెళ్ళండి.. నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని సమాధానం ఇచ్చాడు. ఇక మరొక అభిమాని గురూజీకి ఏదైనా కథ చెప్తే.. దాన్ని మార్చి మార్చి రాసి..
మళ్ళీ దానికి సెట్ అయ్యే స్క్రీన్ ప్లే ని సెట్ చేసి మళ్లీ కొత్తగా కథను తయారు చేస్తారట! నిజమేనా? అని అడిగాడు. ఇది ఇంకో దానికి బండ్ల గణేష్ గట్టిగా స్పందిస్తూ.. ఇది మాత్రమే కాదు అన్నదమ్ములను, భార్యాభర్తలను, తండ్రి కొడుకులను, గురు శిష్యులను అందరిని విడదీసే శక్తి గురూజీకి ఉంది అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. ఈ ట్విట్ చూస్తుంటే త్రివిక్రమ్ అంటే బండ్ల గణేష్ కి ఇప్పటికీ అస్సలు పడటం లేదన్న విషయం పూర్తిగా అర్థం అవుతుంది. బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ కి.. సోషల్ మీడియాలో త్రివిక్రమ్ సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ.. కామెంట్లు చేస్తుంటే బండ గణేష్ సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు బండ్ల గణేష్ గురించి మాట్లాడుతూ.. మరీ దారుణంగా త్రివిక్రమ్ మొగుడు పెళ్ళాలను కూడా విడదీస్తాడని అనడం ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత దారుణంగా అంటారా ఛి ,ఛి అంటూ విమర్శిస్తున్నారు.