చిరంజీవి అంటే అప్పటికి ఇప్పటికి ఒకేరకమైన క్రేజ్ ఉంది.డాన్స్, ఫైట్స్ విషయంలో ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా, ఆయన్ని మించారు అని అనిపించుకోలేకపోయారు. అలాగే బాలకృష్ణ తన నటనతో ఇప్పటికీ ఆడియన్స్ ని అలరించడంలో నెంబర్ 1 గా ఉన్నారు. డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యను మించి ఇప్పటి జనరేషన్ అసలు ట్రై చెయ్యడం లేదు. వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఈ షో కి పెద్ద పెద్ద స్టార్స్ ఆహ్వానం రాగానే వచ్చి, బాలయ్యతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ షో ఆడియన్స్ కి చాలా ఇంటరెస్టింగ్ ఉంటుంది. దానికి కారణం బాలయ్య వాక్ చాతుర్యమే అని అందరి అభిప్రాయం. ఈ షో మొదటి సీజన్ సక్సెసఫుల్ గా పూర్తి అయ్యి, రెండవ సీజన్ కూడా పూర్తి అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ షో కి ప్రభాస్, పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్స్ చాలా క్రేజ్ ని క్రియేట్ చేశాయి.
ఈ షో కి చాలామంది స్టార్ హీరో లు వచ్చారు గాని, చిరంజీవి ఇంతవరకు రాలేదు. అసలు ఈ షో కి మొదటి గెస్ట్ గా చిరంజీవి నే పిలవాలని అనుకున్నారట. కానీ చిరంజీవి ఆ టైం లో బిజీ గా ఉండి, అవ్వలేదట. తరవాత అల్లు అర్జున్ చిరంజీవిని గెస్ట్ గా రమ్మని 3 సార్లు పిలిచాడంట. కానీ పిలిచిన ప్రతీ సారి చిరంజీవి రాలేకపోయారంట. దీనితో అల్లు అరవింద్ ఫీల్ అయిపోయి.. బాలయ్యతో చెప్పారంట.
అసలే బాలయ్యకి ఎప్పుడు కోపం వస్తాదో, ఏమి చేస్తాడో మనకు అర్ధం కాదు. అలాంటి వ్యక్తితో ఏది నెగటివ్ గా చెప్పినా, లోపల కొంచెం భయంగానే ఉంటాది. అల్లు అరవింద్ చిరు గురించి చెప్పగానే.. ఆయన ఫ్రీ గా ఉన్నప్పుడు ఆయనే వస్తారు, మీరు మిగిలిన వాళ్ళని పిలవండి అని చాలా పాజిటివ్ గా బాలయ్య చెప్పారంట. బాలయ్య సమాధానానికి అల్లు అరవింద్ షాక్ అయ్యారంట..