Venu Yeldandi : ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు కానీ.. కృషి, పట్టుదల ఉంటే మాత్రం ఎంత చిన్నస్థాయిలో ఉన్న వాళ్ళైనా.. ఎప్పటికైనా వాళ్ళు అనుకున్న గోల్ రిచ్ అవుతారని ఎందరో ఉదాహరణలు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ పనిని నమ్ముకుని.. దైవంగా ( Balagam movie director Venu ) ఆరాధించి పని చేసుకుంటూ వెళ్లే.. వాళ్లకి ఎప్పటికైనా మంచి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి. చిన్న కమెడియన్ గా ఉన్న వేణు వెల్డండి ఒకే ఒక్క సినిమాతో బలగం అనే సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు ఎలా ఆదరించారో.. కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఊర్లో ఎల్ఈడి టీవీలు పెట్టుకుని.. అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరే కూర్చొని.. ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ సినిమా ఎన్నో అవార్డులను సాధించుకుంది. అంతర్జాతీయ అవార్డులు కూడా సంపాదించుకుంది. అలాగే ఈ సినిమా గురించి పోటీ పరీక్షలు రావడం.. ప్రశ్నలకు జవాబులు రాయడం కూడా జరిగింది. ఇంత ఘనవిజయాన్ని ( Balagam movie director Venu ) ఒక చిన్న కమెడియన్ సాధించడానికి కారణం.. అతనికి సినిమా కథ మీద ఉన్న ఇంట్రెస్ట్. ఇటీవల వేణుని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వేణు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్వ్యూలో వేణుని ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అని అడగడం జరిగింది.. అప్పుడు వేణు ఏ మాత్రం దాచుకోకుండా.. తన విషయాన్ని చెప్పాడు. ప్రతి మనిషికి ఓకే ఫస్ట్ లవ్ ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది. నేను ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడ్డాను.
అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాతో క్లోజ్ గానే ఉంటారు. నన్ను వాళ్ళ ఇంట్లోకి రానిచ్చేవారు. ఇలా అవకాశం దొరకడంతో ఆ అమ్మాయిని విపరీతంగా ప్రేమించి.. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెను పడేసుకోవడానికి ఎన్నో రకాల జ్యోక్స్ వేస్తూ మాట్లాడుతుండేవాడిని. అలాగే నా బర్త్ డే కాకపోయినా కూడా.. బర్త్డే అని చెప్పి ఆమెని, ఆమె ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్లి పార్టీలు ఇచ్చేవాడిని. ఎప్పటికప్పుడు ( Balagam movie director Venu ) ఏదో ఒక మోకా వెతుక్కుని ఎక్కడో చోటుకి తీసుకొని తిప్పి పార్టీలు ఇచ్చేవాన్ని. ఆ క్రమంలో ఆ అమ్మాయితో కొంత క్లోజ్ పెరిగి మాట్లాడుకునేవాడిని. గోల్కొండ కోట అలాగే నక్లెస్ రోడ్ లోనే ఒక పెద్ద హోటల్లో డిన్నర్ కూడా ఇచ్చాను. ఇలా అమ్మాయితో తిరిగినన్ని రోజులు నా జీవితమే మారిపోయింది అన్నంత ఆనందంగా ఉండేవాడిని.
ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత లెక్క వేసుకున్నాను. ఒకేరోజు 30 వేల రూపాయలు ఖర్చయింది. ఖర్చు విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి కోసం ఇంత చేయడం అవసరమా? నేను ఇండస్ట్రీకి రావడానికి నా కుటుంబ సభ్యులు నా అక్కలు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ఎన్నో దేవుళ్ళను మొక్కుకున్నారు. అలాంటి నా కుటుంబానికి చూసుకోకుండా.. కేవలం ఒక అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి.. నా కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఇలా తిరగడం కరెక్ట్ కాదనిపించింది. ఇంత ప్రేమించాక ఆ అమ్మాయి కుటుంబం నాకు అమ్మాయిని పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే పరిస్థితి ఏమిటి అని ఆలోచించాను. అందుకని ఆ అమ్మాయి మీద ప్రేమని పక్కన పెట్టేసి.. ఇంట్లో వాళ్ళు చెప్పిన చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుతున్నాను అని చెప్పాడు. దీంతో వేణు ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి వేణు ప్రేమించిన అమ్మాయిని వదిలేసాడు అనే నిజాన్ని వేణుయే బట్టబయలు చేసుకున్నాడని అందరూ నవ్వుకుంటున్నారు.