Home Cinema Baby Movie Actress: బేబీ బ్యూటీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అవాక్కే. అమె కెరియర్ ఎలా మొదలైంది...

Baby Movie Actress: బేబీ బ్యూటీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అవాక్కే. అమె కెరియర్ ఎలా మొదలైంది అప్పుడు సంపాదన ఎంతో తెలుసా.?

Baby Movie Actress: ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మనల్ని ఎంతగానో ఆలరించిన చిత్రం బేబీ.. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సాయి రాజేష్. ఇక ఈ చిత్రంలో ప్రధానమైనటువంటి పాత్రలలో నటించింది హీరో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ వైష్ణవి చైతన్య అలాగే విరాజ్ అశ్విన్ తదితరులు కాగా.. ఇతర పాత్రలు పోషించిన వారు నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్ మొదలైనటువంటి వారు.. జూలై 14 వ తారీఖున విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను కైవసం చేసుకోవడం మాత్రమే కాకుండా కుర్రాళ్ళకు తెగ నచ్చేసింది అని చెప్పాలి.

baby-movie-actress-vaishnavi-chaitanya-unknown-facts-and-her-full-information

తొలిరోజే అనుకూలమైన స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల సునామి సృష్టిస్తున్నది. అయితే ఈ చిత్రం చూసిన వారందరూ ఖచ్చితంగా మాట్లాడే విషయం ఇందులో నటించిన నటి వైష్ణవి చైతన్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఆమె యాక్టింగ్ చూసినట్లయితే.. బస్తీ అమ్మాయిగా అలాగే గ్లామర్ గర్ల్ గా రెండు పాత్రలను అదరగొట్టింది వైష్ణవి చైతన్య. దీంతో ఒక్కసారిగా అసలు ఎవరి బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని? ఆమె కెరియర్ ఎలా మొదలైందని? ఇలా ఆమె గురించి రకరకాల విషయాలను వెతకడం మొదలు పెట్టేశారు నటిజెన్లు.

See also  Valentines Day: మన తెలుగు తారల ప్రేమ పెళ్లిళ్లు.. ఎవరెవరిది సక్సెస్ రేట్ ఎలా ఉందొ చూద్దాం.

baby-movie-actress-vaishnavi-chaitanya-unknown-facts-and-her-full-information

ప్రస్తుతం ఆమె విషయాన్నికొస్తే ఆమె జన్మించింది ఢిల్లీలో అయినప్పటికీ పెరిగింది మాత్రం మన తెలుగు రాష్ట్రంలోనే.. విజయవాడలో అలాగే హైదరాబాద్ లోనే తన విద్యను పూర్తి చేసుకున్నది. వైష్ణవి చిన్నతనం నుంచే మంచి డాన్సర్. తను స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి ఎన్నో స్టేజీలపై డాన్స్ పెర్ఫార్మన్స్ అదరగొట్టింది. ఆ తర్వాత టిక్ టాక్ లో డబ్ ష్మాస్ లలో వీడియోలు చేస్తూ కొంత గుర్తింపుని మూటగట్టుకుంది. అలా యూట్యూబ్ లో షార్ట్ ఫిలింలో నటించడానికి ఆమెకు అవకాశం దొరికింది. ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ రైటర్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ గా ఎదిగింది. ఆ తర్వాత తనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందగలిగింది. పలు కవర్ సాంగ్స్ చేస్తూ ఉంది.

See also  Samantha : విడాకులు తరవాత సమంత వాటిని కొనడం మానేసిందట..

baby-movie-actress-vaishnavi-chaitanya-unknown-facts-and-her-full-information

ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురము చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అలా టచ్ జగదీష్, రంగ్ దే, వరుడు కావలెను, వలిమై మొదలైన చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా తన టాలెంట్ ను చూపిస్తూ ఎనిమిది ఏళ్ళ అనంతరం బేబీ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్యకు (Baby Movie Actress) అవకాశం లభించింది. ఈ డబ్యూ మూవీలో లీడ్ రోడ్లో మంచి పాత్ర చేసి అదరగొట్టింది. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలు రాబోతున్నాయని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. అయితే వైష్ణవి చైతన్య మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీ అవ్వ కావాల్సిందే.. రోజంతా కష్టపడి డాన్స్ చేస్తే ఆమెకు షో అనంతరం ఆమె చేతిలో 700 రూపాయలు పెట్టారట. ఈ 700 రూపాయలే ఆమె తొలి రెమ్యూనరేషన్.