Baby Movie Actress vaishnavi: మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు రేంజ్ లో మోత మోగిపోతుంది. మొదట నటించి యూట్యూబ్ లో వీడియోల లో చేసింది కానీ ఇప్పటి వరకు ఆమె సినిమాలో హీరోయిన్ గా నటించిన ఒక్కటే ఒక్క సినిమా ఆ ఒక్కటి కూడా హిట్టు. కానీ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ లో హీరోయిన్లు గా కొనసాగుతు ఉన్నటువంటి సీనియర్ హీరోయిన్ల కంటే ఎక్కువగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది వైష్ణవి చైతన్య. దానికి అసలు సిసలైన కారణం ఈ అమ్మడూ ఎంతో ఖచ్చితంగా మాట్లాడడమే..
వైష్ణవి చైతన్య మనసులో ఏది ఉంటే అదే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. ఆ కారణం చేతనే జనాలు ఆమెని తెగ ఇష్ట పడుతున్నారు. అయితే ఇలాంటి క్రమం లోనే ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో వైష్ణవి చైతన్య షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన కెరీర్ మొదట్లో చిన్నచిన్న షార్ట్ ఫిలింలో మరియు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న సమయంలో అక్కడ ఏ షూట్ కి వెళ్ళినా కనీసం వాష్ రూమ్ కూడా సరిగా ఉండేది కాదని.. అంతే కాకుండా డ్రెస్ మార్చు కోవడానికి కూడా డ్రెస్ ల రూమ్ కూడా ఉండక పోయేదని..
బయట ఎక్కడికైనా వెళ్లి వాష్ రూమ్ లో బట్టలు మార్చుకోవాల్సి వచ్చేదని.. ఆ టైంలో నేను ఎంతో బాధపడ్డాను అని నా బాధను చూసి మా అమ్మ సైతం ఎంతగానో ఏడ్చేసిందని ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇంకా కొన్ని సార్లు అయితే మరీ దారుణంగా కొన్ని షూటింగ్ సమయాలలో కనీసం కార్వాన్లు వాష్ రూమ్ యూస్ చేసుకుంటాం అన్న అక్కడ ఉండే వాళ్ళు అవమానించే వాళ్ళని సంచలనమైన వ్యాఖ్యలను బయట పెట్టింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్చల్ గా వైరల్ అవుతుంది.. కాగా ఇటీవలే విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండా మన ముందుకు వచ్చిన బేబీ చిత్రం టీజర్ విడుదల ఐనప్పటి నుంచే కచ్చితంగా సంచలనాలు క్రియేట్ చేసిందని అందరు భావించారు.
దానికి అనుగుణంగానే విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్ ని అందుకొని కాసుల వర్షం కురిపిస్తూ సూపర్ డూపర్ హిట్ చెప్పాలి. ఇక ఈ సినిమా హిట్టు కొట్టడం తో ఇటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కి కూడా చాలా మంచి పేరు రావడమే కాకుండా భారీ హిట్ అతని ఖాతాలో కూడా పడింది. దీంతో ఈ ఒక్క సినిమాతో వైష్ణవి చైతన్య కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందని పలువురు సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఇక వైష్ణవి చైతన్య (Baby Movie Actress vaishnavi) కి మరెన్నో చిత్రాలు అవకాశాలు రావాలని మన తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయాలని చాలా మంది డిమాండ్ కూడా చేస్తున్నారు. చూడాలి మరి తరువాత ఏమి జరుగుతుందో..