Avika Gor: హిందీలో బాలిక మధు అనే సీరియల్ ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆవిక గౌర్.. ఇక అదే సీరియల్ తెలుగులో కూడా విడుదలై చిన్నారి పెళ్లి కూతురు అనే పేరుతో వచ్చింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమయింది ఆవిక. ఈ సీరియల్ కి ఇప్పటికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. సీరియల్ ద్వారానే అంత పాపులాటి మూట కట్టుకుంది ఈ ముంబై పాప.. అలా సీరియల్ ద్వారా తన కెరీర్ను స్టార్ట్ చేసిన ఆవిక చాలా మంచి ఫేం అవుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ చిన్నారి పెళ్లి కూతురు ఉయ్యాల జంపాల అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక ఈ చిత్రంలో హీరోగా నటించినది రాజ్ తరుణ్.. ఇక వీళ్లిద్దరి మధ్య ఈ చిత్రంలో కెమిస్ట్రీ చాలా మంచిగా సెట్ అవ్వడంతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాంతో వీళ్ళిద్దరికీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత వీళ్ళిద్దరికీ వరుసగా అవకాశాలు విరివిగా లభించాయి. ఈ ముంబై పాప బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. సినిమా చూపిస్త మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజు గారి గది 3, C/O ఫుట్ పాత్, థాంక్యూ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, టెన్త్ క్లాస్ డైరీస్, నెట్, పాప్ కార్న్, ఉమాపతి, తను నేను వంటి చిత్రాలలో నటించింది ఆవికా..ఇక ఈ చిత్రాలన్నిటిలో తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, సినిమా చూపిస్త మామ, ఉయ్యాల జంపాల వంటి చిత్రాలు మాత్రమే.. ఇక తన తొలి చిత్రమైన ఉయ్యాల జంపాల సూపర్ హిట్ అవ్వడంతో ఈ హీరోయిన్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని ఏలేస్తుందని చాలామంది సెలబ్రిటీలు కూడా అభిప్రాయపడ్డారట..
ఇక ఇదే నేపథ్యంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనను బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోస్ అనే ఓ గ్రూపులో తనను చేసిందట.. ఇదే కాకుండా ఆవికా గోర్ తో చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోయిన్స్ కూడా చాలా క్లోజ్ గా ఉండేవారట. ఇక ఈ గ్రూపులో తనను చేర్చాక టాలీవుడ్ స్టార్ హీరో అవికా గోర్ కు పర్సనల్గా మెసేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడట.. అలా మాట్లాడుతూ నీ న్యూడ్ వీడియో ఒకటి పంపిస్తావా అని అడిగాడట.. అలా మెసేజ్ ఆ స్టార్ హీరో అడిగేసరికి షాక్కు గురైన అవికా గోర్ వాడికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యి తన నోటికి వచ్చిన మాటలతో ఆ హీరో పై విరుచుకు పడిందట. అంతేకాక ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అని కూడా చూడకుండా నా ముందుకు వస్తే కచ్చితంగా నేను నిన్ను చెప్పుతో కొడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట..
ఇక టాలీవుడ్ స్టార్ హీరోతో అవికా గోర్ (Avika Gor) అలా మాట్లాడడం వలన ఆ హీరో ఆ మాటలన్నీ తన మనసులో పెట్టుకొని తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశాడట. ఇదే కాకుండా ఆమెకు వచ్చిన అవకాశాలను సైతం ఆ దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్లి తనకు అవకాశం రాకుండా మాయ మాటలు చెప్పి ఆమెతో ఏ చిత్రం చేసిన ఫ్లాప్ అవుతుందని చెప్పి వచ్చే అవకాశాలను రాకుండా చేశాడట. ఇక ఈ విషయం గతంలో తెలుసుకున్న ఆవికా గోర్ అప్పట్లో నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని లేదు అని ఒక మాట మాట్లాడిన వీడియో కూడా వైరల్ చేశారు. కానీ నిజానికి అది ఆమె మాట్లాడిన మాట కాదట ఆమె మాటలను ఎడిట్ చేశారని ఆ తర్వాత తెలిసింది. కానీ మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె తన స్థానాన్ని కోల్పోయింది.