నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, అషికా రంగనాథ్ హీరోయిన్ గా, రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో అమిగోస్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మాతలుగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమా పై నందమూరి అభిమానులకి చాలా అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కి దీని ముందు సినిమా బింబిసార పెద్ద హిట్ అవ్వడం కారణం.
సినిమా కథ..
సిద్దూ (కల్యాణ్ రామ్) హైదరాబాద్ లో తన తండ్రి వ్యాపారం అయిన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. రేడియో జాకీగా పని చేసే ఇషిక (ఆషికా రంగనాథ్) అనే అమ్మయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు గాని, అక్కడ అతననుకున్నది వర్కౌట్ అవ్వదు. ఇదిలా ఉండగా, మనిషిని పోలిన మనుషుల వెబ్సైటు లో సిద్దూ జాయిన్ అవుతాడు.
తనని పోలిన మనుషులు తాను కాకుండా మరో ఇద్దరు ఉంటారు. మొత్తం ముగ్గురు ఒక ప్లేస్ లో కలుస్తారు.వారు ముగ్గురు ఉన్నట్టు ఎవరికీ చెప్పరు. అయితే అందులో ఒకరు విలన్. ఆ విలన్ మిగిలిన ఇద్దరినీ ఎలా వాడుకుంటాడు? మిగిలిన ఇద్దరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు? చివరికి ఏమౌతుంది? అనేదే సినిమాకి వెళ్లి చూడాలి.
ఆడియన్స్ రివ్యూ..
ఈ సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందంటే.. సినిమా కథని కొత్తగా రాసుకున్నారు గాని, కొత్తగా తియ్యలేకపోయారు. ఈ కథ చదివితే బాగుంటదేమో కానీ, అంత బాగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. పైగా ఈ రోజుల్లో ఇద్దరు హీరోలు ఉంటేనే, ఇద్దరిలో ఎవ్వరికి పెద్దగా న్యాయం చెయ్యలేని పరిస్థితులు కనబడుతుంటే.. మూడు పాత్రలు ఒకే హీరోకి ఇచ్చి తియ్యడం ఈ జనరేషన్ కి అంతగా ఎక్కడం కష్టమే అనిపించి ఈ సినిమా చూసాక.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అయితే చాలా బాగుంది. మూడు పాత్రలకి న్యాయం చెయ్యాలని చాలా ట్రై చేసాడు కానీ, అక్కడ అన్ని పాత్రలకి సరిపడినంత వేల్యూ లేనప్పుడు, హీరో మాత్రం ఎం చెయ్యగలడు. హీరోయిన్ పాత్ర అందంగా కనబడటం, అప్పుడప్పుడు కథలో జాయిన్ అవ్వడం తప్ప అంతకంటే ఏమి లేదు. ఎన్నో రాత్రులు పాట తప్ప మిగిలినవన్నీ యావరేజ్ గా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ విలన్ పాత్రని మాత్రం దర్శకుడు బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ బాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. మొత్తం మీద సినిమా యావరేజ్ గా ఉంది.టైం పాస్ కి ఒకసారి చూడచ్చు.