Home Cinema Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమాను కిస్ సీన్స్ కోసం మిస్ చేసుకున్న స్టార్ హీరో...

Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమాను కిస్ సీన్స్ కోసం మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?

arjun-reddy-is-the-star-hero-who-missed-the-movie-for-the-kiss-scene

Arjun Reddy: అర్జున్ రెడ్డి ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ ఏడేళ్ళు పూర్తి ఐనప్పటికీ సినీ ప్రియులు మాత్రం ఈ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు.. మరి అంతలా యూత్ ని అట్రాక్ట్ చేసి అప్పట్లో సంచలనాలు సృష్టించింది చిత్రం. ఇక ఈ చిత్రంలో హీరోగా అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటించిగా హీరోయిన్ పాత్రలో శాలిని పాండే అలాగే.. ముఖ్యమైన పాత్రలలో రాహుల్ రామకృష్ణ, సంజయ్, స్వరూప్, కమల్ కామరాజు, కాంచన మొదలైన వారు నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యూత్ ఫుల్ డ్రామా లవ్ స్టోరీ ఇది.. ఇక ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళీ పిక్చర్ బ్యానర్ పై రూపొందించాడు. ఇక ఈ చిత్రం ఎలాంటి ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఆగష్టు 25, 2017 సంవత్సరంలో విడుదల అయింది.

arjun-reddy-is-the-star-hero-who-missed-the-movie-for-the-kiss-scene

కాగా ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. ఐదు కోట్లు పెట్టి తీసిన చిత్రం డబుల్, త్రిబుల్ కాదు ఏకంగా యాభై కోట్ల రేంజ్ లో వసూలు రావట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీని సృష్టించింది. ఇక ఈ చిత్రంతో రాత్రికి రాత్రి విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ చిత్రం మరీ ముఖ్యంగా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా చూడని పోరగాల్లేడు. అలా విజయ్ దేవరకొండ ఈ యొక్క చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఓవర్ నైట్ స్టార్ హీరో అవడం అంటే ఇదే ఇలా కలిసి రావడమే.. ఇక ఈ చిత్రం వైద్యానికి సంబంధించి ఉండగా ఇందులో తాగుబోతు వైద్యుడి అర్జున్ రెడ్డి తన ప్రేమ కథ ఆధారంగా అందరి మనసులను ఆకట్టుకునే డిఫరెంట్ లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ చిత్రం అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ జీవించేశాడు.

See also  Roja - Ramya Krishna : ఇంటికొచ్చిన రమ్యకృష్ణ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రోజా.. వీడియో వైరల్..

arjun-reddy-is-the-star-hero-who-missed-the-movie-for-the-kiss-scene

ఈ చిత్రంలో విజయ్ నటన ఆటిట్యూడ్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసాయి. కేవలం ఈ యొక్క చిత్రంతో సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడ అందరికీ తెలియని ఒక విషయం ఈ చిత్రం గురించి అదేంటంటే.. అర్జున్ రెడ్డి చిత్రాన్ని మొదటగా విజయ్ దేవరకొండ తో తీద్దామనుకోలేదట.. అయితే మొదట చిత్రం యొక్క డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ కథను నేరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్దకే తీసుకెళ్లి చెప్పారట.. కానీ అల్లు అర్జున్ చెప్పినప్పటికి ఈ చిత్రంలో ఉన్న ఇన్ని లిప్ లాక్ సీన్లు నచ్చక మరి అదేవిధంగా ఇందులో ఉన్న రౌడీ బాయ్ పాత్ర తనకు సెట్ గాక ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట.

See also  Nani : హనీమూన్ లో ఉన్న వరుణ్ లావణ్యాలకి సూపర్ జర్క్ ఇచ్చిన నాని..

arjun-reddy-is-the-star-hero-who-missed-the-movie-for-the-kiss-scene

ఇక ఆ తర్వాత శర్వానంద్ ను కూడా సంప్రదించగా ఆయన కూడా ఇలాంటి విషయాలే చెప్పి చాలా సున్నితంగా వద్దని చెప్పాడట.. ఆ తర్వాత అప్పుడప్పుడే మంచి మంచి చిత్రాలలో నటిస్తున్న విజయ్ దేవరకొండ చేతిలోకి వెళ్ళింది ఈ అవకాశం. దాంతో ఇంకేముంది బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యింది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ మొత్తాన్ని రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టించి తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఆ తర్వాత ఈ చిత్రాన్ని కోలీవుడ్లో రీమిక్స్ చేయగా బాలీవుడ్ లో కూడా రీమిక్స్ చేయగా బాలీవుడ్లో ఎవర్గ్రీన్ చిత్రంగా నిలిచింది. అర్జున్ రెడ్డి చిత్రం మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించడంతో.. ఇక అల్లు అర్జున్, శర్వానంద్ లు ఈ చిత్రాన్ని (Arjun Reddy) అనవసరంగా వదిలిపెట్టామని అప్పుడప్పుడు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట..