Naga Chaitanya : టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ పైర్స్ లిస్ట్ తీస్తే అందులో నాగార్జున – అనుష్క జంట కచ్చితంగా ఉంటుంది. అక్కినేని నాగార్జున హీరో గా నటిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించిన ‘సూపర్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది అనుష్క. ఈ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ కూడా కాదు, సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఈమెకి అవకాశాలు వెల్లువలాగా కురిసాయి(Anushka Naga Chaitanya Marriage). ఆమెకి అలా అవకాశాలు రావడానికి కారణం నాగార్జున అనే అంటారు. అప్పట్లో వీళ్లిద్దరు ప్రేమించుకున్నారని, డేటింగ్ కూడా చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బలంగా వినిపించిన టాక్.
అందుకే అనుష్క రెండవ సినిమా కూడా తన కుటుంబ సభ్యుడైన సుమంత్ హీరో గా నటించిన ‘మహానంది’ చిత్రం లో నాగార్జునే నటింపచేయించాడని అప్పట్లో టాక్. ఇవంతా గాలి వార్తలే అని అటు నాగార్జున, ఇటు అనుష్క శెట్టి ఇద్దరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడా కూడా దీని మీద స్పందించలేదు కూడా. కేవలం ఈ ఒక్క రూమర్ మాత్రమే కాదు, అప్పట్లో అనుష్క యోగ టీచర్ గా పని చేసేదని, చాలా మంది సెలబ్రిటీస్ కి ఆమె యోగా క్లాసులు తీసుకునేది అని, అలా నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య కి కూడా యోగా క్లాసులు చెప్పేది అని, అలా వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడి ఇద్దరు ప్రేమించుకున్నారని.
అది కూడా చేసుకున్నారని ప్రముఖ మీడియా ఛానల్ ఆంధ్ర జ్యోతి ఒక వార్త ప్రచారం చేసింది. ఆ తర్వాత అక్కినేని అభిమానుల సెగ ఒక రేంజ్ లో తగలడం తో మాకు తెలియకుండా పొరపాటున ఈ వార్త ప్రచురింపబడింది. దయచేసి మమల్ని క్షమించండి అంటూ ఒక ప్రకటన విడుదల చేసి ఆ వార్త ని వెనక్కి తీసుకున్నారు. ఇది జరిగిన తర్వాత అనుష్క మీద చాలా రూమర్స్ వచ్చాయి కానీ, నాగ చైతన్య మీద ఇలాంటి రూమర్స్ రాలేదు(Anushka Naga Chaitanya Marriage). ఇకపోతే అనుష్క చాలా కాలం తర్వాత మన ముందుకు ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా తో మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమా సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ గా నిల్చింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటినా ఈ చిత్రం ఫుల్ రన్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. అనుష్క ప్రస్తుతం ఎంజాయ్ చేస్తుంది దానికి కారణం తాను లేటెస్ట్ గా నటించిన సినిమా హిట్ అవ్వడమే. ఎన్నో ఏళ్ళ తరువాత సినిమా చేసింది, దాదాపు 5 ఏళ్ళు అని చెప్పొచ్చు. నవీన్ పోలిశెట్టి తో తను చేసిన సినిమా ఇప్పటికి కూడా థియేటర్ లో బాగానే రాణిస్తుంది. నాగ చైతన్య మాత్రం ప్రస్తుతం చేయటానికి ఏ సినిమాలు లేక కాలిగా ఉన్నాడు.