Anu Emmanuel Love Affair: తెలుగు చిత్ర పరిశ్రమ లోకి హీరో నాని నటించినటువంటి చిత్రం మజ్ను తో అను ఇమ్మాన్యుయల్ తొలిసారి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఇక ఆమె నటించిన ఈ చిత్రం తొలి చిత్రం తోనే మంచి విజయాన్ని కైవసం చేసుకుని తన ఖాతాలో పడేసుకుంది. మొదటి చిత్రంతో మన తెలుగులో మంచి హిట్ ను కైవసం చేసుకున్న ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు క్యూలు కట్టాయి. అలా గీతాగోవిందం చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి
ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఊర్వశివో రాక్షసివో, శైలజా రెడ్డి అల్లుడు, రావణాసుర మొదలైనటువంటి చిత్రాల్లో నటించింది. కానీ తన తొలి చిత్రం లాంటి హిట్ మళ్లీ పడకపోవడంతో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కలేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సరసన జపాన్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇక ఇటీవలే ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. తాను కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ కు బలైన బాధితురాలు అంటూ వెల్లడించింది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ అండ ఉండడంతో నేను అందులో నుంచి అవలీలగా బయట పడగలిగానంటూ చెప్పుకొచ్చింది.
కాగా సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజుల నుంచి అల్లు శిరీష్ తో అను ఇమ్మానుయేల్ లవ్ ఎఫైర్ కొనసాగిస్తుందన్న వార్తలు విపరీతంగా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.. అయితే ప్రత్యేకించి అల్లు శిరీష్ అనే పేరు తీయకుండా మరొక సారి ఆ విషయం గురించి క్లారిటీ తెలిపింది అను ఇమాన్యుల్. అదెలాగంటే.. నేను ఓ కుర్ర హీరో తో ప్రేమలో పడ్డాను అటూ నాపై లేనిపోని పుకార్ల ను మీడియా సృష్టించిందని.. ఇక ఈ విషయం నాకంటే ముందు మా అమ్మకే తెలిసింది. ఎందుకంటే నాకంటే ఎక్కువగా మా అమ్మ వార్తలను చూస్తూ ఉంటుంది. ఆ వార్తలు చూసి ఆ హీరో తో నీకు ఎఫైర్ వార్తలు వస్తున్నాయి అంటూ మా అమ్మ తెగ బాధపడడం జరిగింది.
ఆ వార్తలకు చెక్ పెట్టేలా అలాంటి వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ వెల్లడించింది అను.. కేవలం సినిమాలో రొమాన్స్ పంట పండించడం కోసం ఆ హీరోతో నటించానే తప్ప మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి లవ్ ఫెయిల్ అనేది లేదంటూ తేల్చి చెప్పేసింది. ఇక ఈ విషయం కంటే ముందే అదే హీరో కుటుంబానికి సంబంధించిన మరో హీరోతో కూడా నేను నటించాను అంటూ అల్లు శిరీష్ పేరు ప్రస్తావన రాకుండా అతను ఎవరో చెప్పేలా అని ఈ విషయంపై క్లారిటీ తెలియజేసింది. అయితే ఈ విషయం ను పసిగట్టిన చాలా మంది నేటిజన్స్ ఈ విషయం చెప్పింది అల్లు శిరీష్ గురించే అను చెప్పిన మాటలన్నీ.. ఎందుకంటే అల్లు శిరీష్ కంటే ముందే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే చిత్రంలో అను (Anu Emmanuel Love Affair) నటించింది.