Home Cinema Rashmi Gautam: ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడనున్న రష్మీ..! తొందరలోనే ప్రకటన..??

Rashmi Gautam: ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడనున్న రష్మీ..! తొందరలోనే ప్రకటన..??

Rashmi Gautam Marriage: బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ముందుకు రాణిస్తున్న అందాల భామ ఎవరంటే రష్మీ గౌతమ్ అని చెప్పాల్సిందే. అయితే త్వరలో ఈ అందాల యాంకరమ్మ ఏడడుగులు వేయబోతుందట. ప్రస్తుతం రష్మీ వయసు 34, అందుకే తన తల్లి త్వరగా పెళ్లి చేసుకోవాలని రష్మీ గౌతమ్ పై ఒత్తిడి పెడుతుందట. తన తల్లి కోరిక మేరకు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో మన జబర్దస్త్ యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కడానికి పచ్చ జెండా ఊపిందంట అంటూ నెట్టింట జోరుగా వార్తలు పట్టాలెక్కుతున్నాయి.

See also  Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

anchor-rashmi-gautam-is-going-to-marry-a-business-person

అంతేకాదు త్వరలోనే రష్మీ గౌతమ్(Rashmi Gautam Marriage) పెళ్లిపై ప్రకటన ఇవ్వబోతుందంటూ తన కాబోయే భర్తను అందరికీ పరిచయం చేయనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఎండాకాలంలో గోవా వేదికగా డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు రష్మీ కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకుందని టాక్ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే రష్మీ గౌతమ్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. రష్మీ గౌతమ్ పుట్టింది విశాఖపట్నంలోనే, ఆమె 2002లో సవ్వడి అనే సినిమాతో తన సినీ జీవితం మొదలెట్టింది.

See also  Samantha : లండన్ అబ్బాయితో లవ్ కి ఓకే చెప్పిన సమంత.. భలే అందంగా ఉన్నాడు చూడండి..

anchor-rashmi-gautam-is-going-to-marry-a-business-person

కానీ ఆ సినిమా విడుదల కాలేదు. దాని తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది దాని తర్వాత యువ సీరియల్లో నటించింది. ఇవే కాకుండా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించింది. కాగా సినిమాల ద్వారా రష్మికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. దీంతో యాంకర్ గా మారింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా సూపర్ డూపర్ పాపులర్ అయింది.

anchor-rashmi-gautam-is-going-to-marry-a-business-person

ప్రస్తుతం టీవీ షోస్ తో బుల్లితెరపై రష్మీ ఫుల్ బిజీబిజీగా తన జీవితాన్ని గడుపుతుంది. అలాగే అంది వచ్చిన అవకాశాలలో సినిమాలు చేస్తూ హీరోయిన్గా కూడా మెప్పిస్తుంది. అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా జబర్దస్త్ గ్లామర్ ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎల్లప్పుడు టచ్ లోనే ఉంటుంది. సుడిగాలి సుదీర్, రష్మీ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకుంటారని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలన్నీ వాళ్ళిద్దరు కొట్టి పడేసి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ తేల్చి చెప్పకనే చెప్పారు.