
Ananya Nagalla After Surgery: తెలంగాణ ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకొని, తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నటి అనన్య నాగళ్ళ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. చేసింది తక్కువ సినిమాలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి అభిమానమే సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈమే హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈమె సినీ జీవితానికి వచ్చి మొట్ట మొదటి సారిగా మల్లేశం అనే సినిమాతో నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి పరిచయమైనది.
ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా, ఆయనకు భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మంచి సినిమాలో అవకాశం దక్కించుకుంది అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలకమైన పాత్ర తాను పోషించింది. తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ సాధించి ఆ సక్సెస్ పేరుతోనే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందని చెప్పాలి. ప్లే బ్యాక్ అనే సిరీస్ లో నటించిన అనన్య దాంతో మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరగడంతో అందరికీ ఆమె హాట్ అందాలతో విందు చేస్తూ ఒక్కసారిగా షాక్ ఇస్తుంది సత్తుపల్లి ముద్దుగుమ్మ.
ఇదే కాక ఒకేసారి స్టార్ హీరో సినిమాలలో వరుసగా నటించడంతో ఈమెకు అవకాశాలు కూడా వెతుకుతున్నాయి. ఇదే క్రమంలో ఈమె గ్లామర్ షో చేయడానికి కూడా వెనకాడడం లేదట ఈ తెలంగాణ ముద్దుగుమ్మ. మరొక విషయం ఏమిటంటే ఏమైనదో తెలియదు కానీ ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ చేయని గ్లామర్ తో అనన్య నాగళ్ళ చేసింది.. అయినా కూడా ఇప్పటివరకు ఈమెకు ఆమె స్థాయికి మించిన అవకాశాలు పెద్దగా ఏమాత్రం కూడా రావడం లేదు. ప్రస్తుతానికైతే ఆమె ఏ సినిమాలో నటిస్తుందో అన్న విషయం కూడా తెలియడం లేదు.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమెపై ఒక ట్రోల్ విపరీతంగా చెక్కర్లు కొడుతుంది అదేంటంటే ప్రస్తుతం ఆ వార్త చాలా వైరల్ గా కూడా మారింది. తాజాగా ఈ అమ్మడు తన ముక్కు మరియు పెదాలకు సర్జరీ (Ananya Nagalla After Surgery) చేయించుకున్నట్లు తెలుస్తోంది. అవి సర్జరీ చేయించుకోవడంతో ఆమె ముఖం మొత్తం మారిపోయింది అన్నట్లుగా కనిపిస్తుంది. మొదట్లో చాలా అందంగా ఉండే ఈ అమ్మడు ఈ సర్జరీ తర్వాత తన అందం అంతా ఆకట్టుకోలేక పోయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అప్పటినుంచి ఆమె సోషల్ మీడియాలో ఏ ఫోటోలు షేర్ చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.