Aarthi Agarwal : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఆమె మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆర్తి అగర్వాల్ గుజరాతి కుటుంబానికి సంబంధించిన ( Aarthi Agarwal words about her sad ) అమ్మాయి. ఆమె మొదట 2001లో బాలీవుడ్లో పాగల్ పాన్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఆర్తి అగర్వాల్కి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె డి. సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించింది విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా ఆ సినిమా చేయడం జరిగింది. ఇక నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆర్తి అగర్వాల్ కి మంచి అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలు అందరి సరసన నటించేసింది. అప్పట్లో అగ్రస్థానం కథానాయకులుగా ఉన్న చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున అందరి సరసన ఆమె ( Aarthi Agarwal words about her sad ) నటించేసింది. అంతేకాకుండా యువ హీరోలైన అప్పటి కథానాయకులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళ అందరితో కూడా నటించింది. అప్పట్లో కుర్రకారికి ఆమె అంటే విపరీతమైన పిచ్చి. ఆర్తి అగర్వాల్ అందచందాలు గాని, ఆమె నటన విధానం గాని అంటే అందరికీ మహా ఇష్టం.
అయితే ఆర్తి అగర్వాల్ తరుణ్ ని ప్రేమించిందని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరు ప్రేమకి , పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకే ఆమె ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేది ఎప్పుడు కూడా వాళ్ళు బయట పెట్టలేదు. అయితే కొంతకాలానికి ఆర్తి అగర్వాల్ నెమ్మదిగా ( Aarthi Agarwal words about her sad ) ఫీడ్ అవుట్ అవ్వడం మొదలు పెట్టింది. అదే సమయంలో డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ తో ఆమె వర్క్ చేయడం జరిగింది. అమ్మ రాజశేఖర్ మొదటి డాన్స్ మాస్టర్ గా కొరియోగ్రఫీ అందించేవాడు. ఒక మాస్ సాంగ్ ని అందించాలంటే అమ్మ రాజశేఖర్ ని మించి ఎవరూ లేరని అనుకునేవారు. క్లైమాక్స్ మాస్ సాంగ్స్ కచ్చితంగా అతనితోనే చేయించేవారు.
అలాంటి అమ్మ రాజశేఖర్ అతను డాన్స్ మాస్టర్ నుంచి సినిమా డైరెక్టర్ అయ్యాడు. రణం అనే సినిమానే డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత అతను టక్కరి, ఖతర్నాక్ లాంటి సినిమాలో చేశాడు. కానీ అవి డిజాస్టర్ గా మిగలడంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆయన హీరోగా దర్శకత్వంలో సినిమాను చేశారు. ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్గా పెట్టుకోవడం జరిగింది. అప్పటికే చాలా వరకు సినిమాలుకు దూరంగా వెళ్లిపోయిన ఆర్తి అగర్వాల్ అతనితో బాధపడుతూ.. నన్ను అందరూ వాడుకున్నారు చివరికి నన్ను ఇలా దూరంగా పెట్టారని ఏడుస్తూ చెప్పిందన్న విషయం అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ టైంలో అతను ఆర్తి అగర్వాల్ కు ధైర్యం ఇచ్చి.. మీకు మంచి కెరీర్ ఇంకా ఉంది, మీ లైఫ్ బాగుంటుందని చెప్పాడంట. కానీ ఆ తర్వాత ఆమె అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఆర్తి అగర్వాల్ మరణం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో అభిమానులకి బాధ కలిగించింది.