Pawan Kalyan – Amitabh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ రెండిటిలోనూ ప్రజెంట్ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా.. ఆయన అభిమానులు అక్కడ ( Pawan Kalyan and Amitabh ) వాళ్ళ దృష్టిని మొత్తం పెట్టి ఎంతో అభిమానాన్ని చూపిస్తారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఓజి అని టైటిల్ పెట్టడం కూడా జరిగింది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఈ సినిమాపై ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చూస్తే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఎలక్షన్ల బిజీలో కాన్వాసింగ్ కి ఆంధ్రప్రదేశ్లో బిజీబిజీగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకని ( Pawan Kalyan and Amitabh ) ఆయన అవసరం లేని కొన్ని రోజులు షూటింగ్స్.. మిగిలిన తారాగణంతో శరవేగంగా జరుపుతున్నారు. ఆయన మాత్రమే ఉండాలి అనే కొన్ని కాన్సెప్ట్స్ కి కొన్ని డేట్లు ఇచ్చి ఆయన్ని రమ్మని పిలుస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఇటు సినిమా రంగాన్ని అట రాజకీయాన్ని రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న సంగతి అర్ధమవుతూనే ఉంది. ఇక ముందు ముందుకు రాజకీయాలలో ఇంకా బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ నే తీసుకున్నారు. ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ నటుడు.. ఇవాళ రేపు మనం తెలుగు సినిమాల్లో విలన్ గా బాలీవుడ్ నటులు వస్తుంటే.. హిందీ సినిమాల్లో విలన్ గా మన తెలుగు నటులు వెళుతున్నట్టు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హిందీ సినిమాలో విలన్ పాత్ర ఒప్పుకున్నట్టు వార్తలు ( Pawan Kalyan and Amitabh ) అయితే వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఆగస్టు నెలలో ఇంకొక 15 రోజులపాటు సినిమా షూటింగ్ చేసేందుకు ఒప్పుకున్నారట. ఆ టైంలో ఆయన పాత్ర ఇంకా ఎంత ఉంటే అంత చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారంట. ఎందుకంటే ఇక ముందు ముందుకు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఇంకా గట్టిగా తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి.. సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అంట.
ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందంట. ఈ సినిమాలో తండ్రి కొడుకుల ప్రతి శీను అద్భుతంగా పండేట్టు దర్శకుడు ప్రిపేర్ అవుతున్నాడు అంట. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి తండ్రి పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నే సంప్రదించారంట. ఇంతవరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు గాని.. సినీవర్గాలు చెప్పుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ కి తండ్రిగా అమితాబచ్చన్ సంప్రదించారని.. అతను కూడా ఒప్పుకునేలా ఉన్నాడని వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందని.. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే ఖచ్చితంగా ప్రతి సీను గట్టిగా పండుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే ఇది ఎంతో ఆనందకరమైన వార్తగా ఉప్పొంగిపోతున్నారు.