Allu Arjun : సెలబ్రెటీ ల పెళ్లి అనుకుంటే.. ఆ పెళ్లి గురించి అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. సామాన్యుల పెళ్లిల్లో కూడా కట్న కానుకలు ఏమిటి? ఎక్కడ చేయబోతున్నారు? ఎలాంటి కుటుంబం? ఇలాంటి ప్రశ్నలు అన్ని వింటూనే ఉంటాం. అలాగే స్టార్ హీరోలు పెళ్లిలో కూడా ఎవరు చేసుకోబోతున్నారు? ఎలాంటివారు ( Allu Arjun dowry matter in his marriage )ఎలాంటి కుటుంబం అని అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మన టాలీవుడ్ స్టార్ హీరోలు కొంతమంది పిల్లలు మాత్రం భారీగానే కట్నాలు తీసుకున్నారని వార్తలు మాత్రం వస్తూ ఉండేవి. పైగా భారీగా అంటే మామూలుగా కాదు వేల కోట్లలో కట్నంగా తీసుకున్నారని అనేక వార్తలు వచ్చేవి. వీటిలో ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు గానీ.. ఎవరికి వారు వాళ్ళకి నచ్చినంత ఊహించుకుంటూ ఉండేవారు.
ఇలాంటి పరిస్థితి చిన్న చిన్న హీరోల విషయంలో మాత్రం కాదు.. పెద్దపెద్ద హీరోల విషయంలో అనేక వార్తలు వచ్చేవి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇక ఇటీవల ఎంగేజిమెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధంగా ఉన్న ( Allu Arjun dowry matter in his marriage ) వరుణ్ తేజ్ కూడా వదిలిపెట్టకుండా వేల కోట్లలో కట్నాలు తీసుకున్నారు అంటూ అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. అందరికంటే ఎక్కువగా టాలీవుడ్లో మహేష్ బాబుకు విపరీతమైన కట్నం వచ్చిందని అంటూ ఉంటారు. అలాగే రామ్ చరణ్ కు కూడా ఉపాసన ద్వారా చాలా ఆస్తులు కలిసి వచ్చాయని అంటూ ఉంటారు. ఏదేమైనా ముందు జంటలు కలిసి ఆనందంగా బ్రతకడం ముఖ్యంగానీ.. వాళ్ళు ఎంత కట్నం తెస్తే ఏమిటి? లేకపోతే ఏంటి? అని అభిమానులు అనుకుంటూ ఉంటారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా స్నేహారెడ్డి వేల కోట్లలో కట్నం తెచ్చింది అంటూ వార్తలు వచ్చేవి. అల్లు అర్జున్ పెళ్లి విషయంలో, కట్నం విషయంలో అసలు నిజాలను.. స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి బయట పెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉండగా.. యాంకర్ మీరు మీ అల్లుడికి ఎన్ని కోట్లు ( Allu Arjun dowry matter in his marriage ) కట్నం ఇచ్చారు అని అడిగితే.. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వారికే వేలకోట్ల ఆస్తులున్నాయి. వారికి కట్నం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అడిగారు. నేను అల్లు అర్జున్ కి ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వలేదు. అల్లు అర్జున్ వేల కోట్లలో కట్నం తీసుకున్నాడు అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. నేను ఒక్క రూపాయి కూడా ఆయనకు కట్నం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. వాళ్ళ హీరో రీల్ హీరో మాత్రమే కాదని రియల్ హీరో అని ఆనందంలో పొంగిపోతున్నారు. ఎన్నో కోట్లకు వారసుడు, ఐకాన్ స్టార్ అయినా కూడా తన భార్యని పెళ్లి చేసుకునేటప్పుడు.. ఎటువంటి రూపాయి కట్నం అడక్కుండా చేసుకున్నాడంటే.. నిజంగా అల్లు అర్జున్ గ్రేట్ అని అనుకుంటున్నారు. అందుకే నిజం అనేది ఎప్పటికైనా తెలుస్తుందని మన పెద్దలు అంటారు. ఎప్పటికప్పుడు మన స్టార్స్ మీద ఏదో ఒక రూమర్ వచ్చినా కూడా.. నిజం ఎప్పటికైనా బయటకు వచ్చి.. అన్ని విషయాలు బయటకు వస్తాయి. మొత్తం మీద అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదు అనే పచ్చి నిజాన్ని స్నేహ రెడ్డి తండ్రి నోటితో చెప్పడం జరిగింది. ఇక అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.