Home Cinema Allu Arjun Heroine : అల్లు అర్జున్ హీరోయిన్ బాలీవుడ్ హీరో అపార్ట్మెంట్ లోకి మకాం.....

Allu Arjun Heroine : అల్లు అర్జున్ హీరోయిన్ బాలీవుడ్ హీరో అపార్ట్మెంట్ లోకి మకాం.. ఆమెకు అంత ధైర్యం ఎక్కడిది?

allu-arjun-heroine-adah-sharma-purchases-sushanth-singh-rajput-apartment-where-he-died

Adah Sharma : హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి అందరి హార్ట్ లలో తనకంటూ ఓ స్థానాన్ని నిలుపుకుంది ఆదాశర్మ. నితిన్ హీరోగా, ఆదాశర్మ హీరోయిన్గా నటించిన హార్ట్ ఎటాక్ సినిమా తెలుగు ఆడియన్స్ అని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండటం వల్ల.. పైగా మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఆదాశర్మ అందరికీ ( Allu Arjun heroine Adah Sharma ) గుర్తుండిపోయింది. అలాగే ఆ ఆసినిమా తరవాత ఆమె అల్లు అర్జున్ తో చేసిన సన్ అఫ్ సత్యమూర్తితో కూడా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న సినిమాలు కాకపోవడం వలన నెమ్మదిగా తెలుగు సినిమాల్లో ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ పై వైరల్ అవుతున్న ఆ నటుడి మాటలు..

allu-arjun-heroine-adah-sharma-purchases-sushanth-singh-rajput-apartment-where-he-died

తెలుగు సినిమాలు ఎక్కువగా నటించకపోయినప్పటికీ ఆదాశర్మ కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. కేరళ స్టోరీ అనే సినిమాతో ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. కేరళలో అమ్మాయిలు మిస్సింగ్ మీద వచ్చిన ఈ సినిమా మంచి ప్లేస్ సంపాదించుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాలో నటించిన ( Allu Arjun heroine Adah Sharma ) ఆదాశర్మకి మంచి క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత ఆమెకి బాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ బాగానే వచ్చాయి. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ఆదాశర్మ మీద ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఈ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

See also  VD12 : విజయ్ దేవరకొండ VD12 తో రష్మిక కు లింక్ ఉందా..

allu-arjun-heroine-adah-sharma-purchases-sushanth-singh-rajput-apartment-where-he-died

బాలీవుడ్లో యంగ్ హీరోగా అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మనందరికీ తెలిసిందే. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుని.. అతి తక్కువ సమయంలోనే అందర్నీ వీడి వెళ్ళిపోయిన హీరో గురించి మాట్లాడుకుంటే మనకు తెలుగులో ఉదయ్ కిరణ్ ( Allu Arjun heroine Adah Sharma ) గుర్తుకొస్తాడు. చాలా చిన్న వయసులోనే కెరీర్ లో మంచి సక్సెస్ సాధించినా కూడా.. జీవితంలో సక్సెస్ అనుభవించకుండా వెళ్లిపోయిన హీరోలు వీళ్ళు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒక అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే అతను ఏ కారణం వల్ల సూసైడ్ చేసుకున్నాడు అనే సంగతి ఇంతవరకు తెలియలేదు.

See also  Niharika : పెళ్లి గురించి నోరు విప్పిన నిహారిక.. అందుకే తన కోసం అందరూ వెయిటింగ్ అంట.

allu-arjun-heroine-adah-sharma-purchases-sushanth-singh-rajput-apartment-where-he-died

అయితే ఇప్పుడు సుశాంత్ సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ హీరోయిన్ ఆదాశర్మ కొనుక్కుంటుందట. సుశాంత్ సూసైడ్ చేసుకున్న ఫ్లాట్ సుశాంత్ కాదు.. అతను రెంట్ కి ఉండేవాడు. ఆదాశర్మ ఆ ప్లాట్ ని ఎందుకు కొనుక్కుంటుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదైనా ఇంట్లో ఎవరైనా తెలియనివాళ్ళు చనిపోయారు అని తెలిసినా కూడా.. ఆ ఇల్లు కొనుక్కోడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటిది బాలీవుడ్లో అంత మంచి యంగ్ హీరో అందరికీ తెలిసిన వాడు అందులో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్నా కూడా.. ఆ ఫ్లాట్ కొనుక్కోవడానికి అదాశర్మ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది? దాని వెనక ఏముంది? అని అందరూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇది సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది కానీ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియడం లేదు..