Home Cinema Allu Arjun – Klin Kaara : కోడలు క్లిం కార కోసం అదిరిపోయే గిఫ్ట్...

Allu Arjun – Klin Kaara : కోడలు క్లిం కార కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!

allu-arjun-gave-a-wonderful-gift-to-his-daughter-in-law-klin-kaara

Allu Arjun – Klin Kaara : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అలాగే మెగా కుటుంబంలో చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఉండే రిలేషన్ కి కూడా అంత గౌరవం ఉంది. ఎవరైనా కూడా వీళ్ళిద్దరిని ఒక రకమైన ఆదర్శంగా తీసుకుంటారు. ఇద్దరి మనుషుల అనుబంధం, ఇన్నేళ్లపాటు చెక్కుచెదరకుండా ( Allu Arjun and Klin Kaara ) ఒకరిపై ఒకరికి ఇంకా అభిమానం పెరిగేలా ఉందంటే.. నిజంగా వాళ్ళిద్దరిలో ఎవరి గొప్పతనము అనేది చెప్పుకోలేం.. కచ్చితంగా ఇద్దరు గొప్పవాళ్ళు అయి ఉంటారు. కాబట్టే ఆ రిలేషన్ అంత బాగా నడుస్తుంది. అందుకే ఈరోజు మెగా కుటుంబం అనేది ఇంత గొప్పగా నడుస్తుంది అంటే.. కారణం ఏ ఒక్కరూ కాదు వాళ్ళిద్దరి స్వయంకృషి.

allu-arjun-gave-a-wonderful-gift-to-his-daughter-in-law-klin-kaara

తెరపై చిరంజీవి కనిపిస్తే.. తెర వెనుక అల్లు అరవింద్ ఉండి.. రెండు కుటుంబాలని సినిమా రంగంలో ఎంత స్ట్రాంగ్ చేసాడనేది అందరూ కనిపెట్టగలరు. అలాగే వాళ్ల పిల్లలు రాంచరణ్, అల్లు అర్జున్ కూడా ఎంతో చనువుగా.. ఎంతో అభిమానంగా.. ఒకరంటే ఒకరు గౌరవిస్తూ, అభిమానిస్తూ, వాళ్ళు మెలిగే విధానం కూడా చాలా బాగుంటుంది. చిన్నచిన్న ( Allu Arjun and Klin Kaara ) కుటుంబాల్లోనే ఇలాంటి బంధాల్లో ఎక్కడో ఒకచోట చెడి ఏదో రకంగా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళ కుటుంబంలో ఏం చెప్పుకున్నారో, ఏమి రాసుకున్నారో తెలీదు కానీ.. ఎప్పుడూ ఒకరి కోసం ఒకరు మేము ఉన్నాం అన్నట్టే మసులుకుంటారు. అదే మెగా కుటుంబం గొప్పతనం అని అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసనలకు ఆడపిల్ల పుట్టిందన్న విషయం మనందరికీ తెలిసిందే.

See also  Sharath babu: హీరోయిన్ నమితను నిజంగానే శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడన్నది ఎంత వరకు వాస్తవం.??

allu-arjun-gave-a-wonderful-gift-to-his-daughter-in-law-klin-kaara

రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించుకుని.. పెళ్లి చేసుకుని.. ఎంతో అన్యోన్యంగా జీవించే జంట ఈ జంట. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మాత్రమే కాకుండా.. గౌరవించుకుంటూ, ఒకే నిర్ణయాన్ని ఒకేలా అవలంబిస్తూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మంచి జంట. వీళ్ళిద్దరికీ ఇన్నేళ్ల తర్వాత పుట్టిన పాపకి క్లింకార ( Allu Arjun and Klin Kaara ) అని పేరు పెట్టి, ఆ నామకరణ వేడుక కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకుని.. మెగా కుటుంబంలో అందరికీ ఆనందాన్నిచ్చారు. క్లింకార పుట్టిన తర్వాత మెగా కుటుంబం, మెగా అభిమానులు, సినీ సినిమా రంగం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా.. ఎవరికి నచ్చిన, తోచిన గిఫ్ట్ వాళ్ళు క్లిం కార కి ఇవ్వడం జరిగింది.

See also  Chiranjeevi : రాధ కూతురు పెళ్ళిలో చిరంజీవి తన పాత హీరోయిన్స్ తో ఎంత అల్లరి చేసాడో ఫొటోస్ వైరల్..

allu-arjun-gave-a-wonderful-gift-to-his-daughter-in-law-klin-kaara

క్లిం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా బంగారు లాకెట్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అలాగే శర్వానంద్ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కూతురు క్లిం కార కోసం మంచి గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. పైగా అల్లు అర్జున్ కి కోడలు కాబట్టి.. కోడలు గురించి చాలా గొప్పగా ఆలోచించి సూపర్ గిఫ్ట్ ఇచ్చాడని అభిమానులు పొంగిపోతున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే.. పుట్టిన సమయం, తేదీ, రోజు, సంవత్సరం ఇలా అన్ని డీటెయిల్స్ తో బంగారు పలక మీద.. బంగారు అక్షరాలు చెక్కించి గిఫ్ట్ గా ఇచ్చాడంట. అది చూసిన రామ్ చరణ్, ఉపాసన ఆనందంతో పొంగిపోయారంట. అభిమానులు.. కోడలు కదా ఎంతైనా బాగా ఆలోచించే ఇస్తాడులే అని కామెంట్ చేసుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ బంధం కూడా చిరంజీవి అల్లు అరవింద్ లాగా ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.