Home Cinema Allu Arjun -Vaishnavi Chaitanya : వైష్ణవికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..

Allu Arjun -Vaishnavi Chaitanya : వైష్ణవికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..

allu-arjun-gave-a-super-gift-to-the-baby-movie-heroine-vaishnavi-chaitanya

Allu Arjun -Vaishnavi Chaitanya : ట్యాలెంట్ అంటూ ఉంటే.. వాళ్లలో కృషి పట్టుదల అనేది ఉంటే.. నిరాశ పడిపోకుండా ఓర్పు.. సహనం ఉంటే.. ఎప్పటికైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనడానికి ఉదాహరణ బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య. హీరోయిన్ అవుదామని కలలు కని టాలీవుడ్ కి అడుగుపెట్టిన ( Allu Arjun and Vaishnavi Chaitanya ) వైష్ణవి చైతన్య.. అలాంటి అవకాశాలు దొరక్క.. కనీసం యూట్యూబ్లో అయినా తన ట్యాలెంట్ ని చూపించుకుందామని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. ఇన్స్టాల్ రీల్స్ చేసుకుంటూ ఉంటున్న వైష్ణవి చైతన్య.. ఈ ప్రయత్నాన్ని చేస్తున్నది నెలల్లోనూ, ఒకటి రెండు సంవత్సరాల్లో కాదు.. 8 ఏళ్లగా హీరోయిన్ అవ్వాలి అనే తపనతో ప్రయత్నిస్తూనే ఉంది.

allu-arjun-gave-a-super-gift-to-the-baby-movie-heroine-vaishnavi-chaitanya

ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఊరికే పోలేదు. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ లో ఆమె నటన చూసి.. ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న దర్శకుడు సాయి రాజేష్ వలన.. ఆమెకు ఒక మంచి అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని ఆమె ఏ మాత్రం పాడు చేసుకోకుండా.. తన వంతు తాను కృషి చేసి.. ఒక ట్రెండ్ ని క్రియేట్ ( Allu Arjun and Vaishnavi Chaitanya ) చేసింది. బేబీ సినిమా రాకముందు వైష్ణవి చైతన్య గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎప్పుడైతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించి.. ఆ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో.. అక్కడి నుంచి ఎవరి నోట విన్నా.. ఈ హీరోయిన్ పేరే వినిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ఒక్క మాటతో.. ఆమె ఎంత నాచురల్ గా తన కష్టాన్ని, తన ఉనికిని గౌరవిస్తుందో అర్థమైంది.

See also  Pawan Kalyan: రెబల్ స్టార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవర్ స్టార్.. ఎంతో తెలుసా.?

allu-arjun-gave-a-super-gift-to-the-baby-movie-heroine-vaishnavi-chaitanya

ఇంటర్వ్యూలో వైష్ణవి మాట్లాడుతూ.. బస్తీలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి పాత్రలో మీరు కనిపిస్తారని దర్శకుడు చెప్తే.. ఎగిరి గెంతేసానని చెప్పింది. ఎందుకంటే.. నేను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీలో అమ్మాయినే కాబట్టి నాకు భలే ఆనందం పుట్టిందని చెప్పింది. అంటే.. ఆమె ఐడెంటినీ ఎక్కడా దాచుకోకుండా ఆమె కూడా ఒక బస్తీ ( Allu Arjun and Vaishnavi Chaitanya ) నుంచి వచ్చిన అమ్మాయి అని ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్పుకుంది. హీరోకి ఒక సినిమా హిట్ అయితే మళ్లీ ఆ రేంజ్ లో ఇంకొక సినిమా దొరకడానికైనా కొంత టైం తీసుకుంటుందేమో కానీ.. హీరోయిన్ కి మాత్రం మొదటి సినిమా హిట్ అయితే కనీసం ఒక పది సినిమాలు తన ఖాతాలో వచ్చి పడతాయి. అయితే అవి ఎలాంటివి పడతాయి, అవి ఎలా సెలెక్ట్ చేసుకుంటాది, ఆ హీరోయిన్ ఎలాంటి హీరోలతో వస్తుంది అవకాశం అనేది చెప్పలేం..

See also  Samantha : ట్రీట్మెంట్ కోసం సమంత ఆ హీరో దగ్గర అప్పు చేసింది అంటే మీరు నమ్ముతారా?

allu-arjun-gave-a-super-gift-to-the-baby-movie-heroine-vaishnavi-chaitanya

అయితే వైష్ణవి చైతన్యకు మాత్రం సూపర్ డూపర్ ఆఫర్ వచ్చింది. బేబి సినిమాని అల్లు అర్జున్ ఎంతగా పొగిడాడో మనందరికీ తెలుసు. పైగా వైష్ణవి చైతన్య నటనకి నేను ఫిదా అయిపోయానని పబ్లిక్ గా చెప్పాడు అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ వైష్ణవి చైతన్యకి మంచి గిఫ్ట్ ఇచ్చాడంట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. వైష్ణవి చైతన్య నెక్స్ట్ సినిమా గీత ఆర్ట్స్ లో.. అల్లు అరవింద్ నిర్మాణంలో.. దానికి హీరో అల్లు శిరీష్ అని అంటున్నారు. పైగా ఈ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ పూర్తిగా సపోర్ట్ ఇచ్చాడంట. దీనితో ఇక వైష్ణవి రెండో సినిమా గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప సంస్థలో అల్లు వారి అబ్బాయికి హీరోయిన్ గా చేయడం అంటే మామూలు మాట కాదు. మొత్తానికి వైష్ణవి నటనకి ఫిదా అయ్యానని వట్టి నోటి మాటగా చెప్పకుండా.. ఆమె కష్టానికి ప్రతిఫలంగా అల్లు అర్జున్ అంత మంచి గిఫ్ట్ ఇచ్చాడని అభిమానులందరూ అల్లు అర్జున్ ని పొగుడుకుంటున్నారు.