Allu Arha: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు ఆర్హ గురించి మన అందరికీ తెలిసిందే.. తన చిట్టి పొట్టి మాటలతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుని కేవలం ఐదేళ్ళ వయసులోనే సినిమా రంగ ప్రవేశం చేసిందంటే మామూలు విషయం కాదు. ఇక ఇటీవలే విడుదలైన శాకుంతం చిత్రంతో అల్లు అర్హ సినీ కెరియర్ మొదలయ్యిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో దేవ్. మోహన్, సమంతలు జంటగా కలిసి నటించగా అల్లు అర్హ భారత అనే పాత్రలో నటించింది. ఏప్రిల్ నెలలో విడుదలైన ఏ చిత్రం ఆశించిన స్థాయిలోనైతే విజయాన్ని కైవసం చేసుకోలేదు. కానీ ఈ చిత్రంలో భారత పాత్ర పోషించిన అల్లు అర్హకు మాత్రం మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి.
తన బుడ్డి బుడ్డి మాటలతో అదిరిపోయే డైలాగ్ డెలివరీతో అల్లు అర్హ అదరగొట్టిందని చెప్పాలి. ఇక ఈ చిత్రం అనంతరం అర్హకు మరొక ఆఫర్ కూడా లభించింది. ప్రస్తుతం తారక్ నటిస్తున్న దేవర చిత్రంలో ఆర్హ నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నది. ఇక ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో తారక్ సరసన జోడిగా దివంగత తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తున్నది.
ఇక ఇన్ని రోజులు బాలీవుడ్ లో నటించిన జాన్వి కపూర్ తొలి సారిగా సౌత్ ఇండస్ట్రీలో నటిస్తున్నది. మరి ముఖ్యంగా మా తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ లో నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో మరొక బాలీవుడ్ యాక్టర్ కూడా ఉన్నాడు ఇక ఆ బాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ కి పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. మరి అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం పలు షూటింగ్ పనులు మన హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఇక ఇటీవలే ఈ చిత్రం యొక్క ఐదవ షెడ్యూల్ కూడా పూర్తయింది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ మన ముందుకు వచ్చింది. చిత్రంలో జాన్వి కపూర్ చిన్ననాటి ఓ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర చేయడం కోసమే డైరెక్టర్ కొరటాల శివ అల్లు అర్జున్ కూతురు అరహను సెలెక్ట్ చేశాడట.
ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అవ్వగా.. వచ్చే నెల మొదటి వారం లో అర్హ షూటింగ్ కార్యక్రమంలో పాల్గొనబోతుందట. ఇక దేవర చిత్రంలో అల్లు అర్హ నటించే సమయం పది నిమిషాలు ఉండబోతుందట.. కేవలం ఈ పది నిమిషాల సీన్ కోసమే అల్లు అర్జున్ కూతురు (Allu Arha) ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటిందో తెలిస్తే అవాక్క్ అవ్వాల్సిందే.. ఆ పది నిమిషాల పాత్ర కోసం 20 లక్షలు తీసుకోబోతుందంట. అంటే నిమిషానికి రెండు లక్షల రూపాయలు. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు కాక తెలుగు ప్రేక్షకు సైతం అవుతున్నారట. ఇక మాత్రం తండ్రికి తగ్గ కూతురుని తీర్చుకుందాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతుంది.