
Akkineni Akhil : అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అక్కినేని అఖిల్ తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి చాలాకాలం అయ్యింది. అఖిల్ కెరియర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బాచ్యులర్ సినిమా ఒక్కటి తప్ప మిగిలినవి ఏమి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా కూడా అఖిల్ మాత్రం ఎప్పుడు నిరాశ చెందకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. అయితే ఇంతకాలం అఖిల్ కి ( Akkineni Nagarjuna’s speech about Akhil ) అక్కినేని వారసుడి పంధాలో చూసే అందరూ ఆఫర్స్ ఇచ్చారు. అంటే.. అక్కినేని వారసుడు అంటే ఫస్ట్ ఆప్షన్ లవ్ స్టోరీస్. ప్రేమకథ చిత్రాలతో అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య హిట్స్ కొట్టిన సంగతి తెలిసినదే. అదే క్రమంలో, అలాంటి కోణంలోనే అఖిల్ గురించి కథలు పట్టుకుని దర్శకులు వస్తున్నారు.
ఇలాంటి ఆలోచనలు నుంచి బయటకు తాను రావాలనుకున్నాడో.. లేక అందరిని రప్పించాలని అనుకున్నాడో అఖిల్ తెలీదు కానీ, అక్కినేని కుటుంబానికి పూర్తి బిన్నంగా ఉన్న సినిమా ఏజెంట్ లాంటి యాక్షన్ స్పై కథని సెలెక్ట్ చేసుకున్నాడు. పైగా ఈ సెలక్షన్ లో (Akkineni Nagarjuna’s speech about Akhil )ఎవ్వరి పాత్ర లేదని, కేవలం తన గురించి తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా పై అక్కినేని అభిమానులకు మాత్రం చాల ఆశలే ఉన్నాయి. అఖిల్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో అందరిని ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి అఖిల్ ప్రమోషన్ లో ఎప్పటికప్పుడు ఒక్క మాట మాత్రం చెబుతూ వస్తున్నాడు.
నన్ను నన్నుగా అఖిల్ గా ఈ సినిమాని చూడండి గాని, అక్కినేని వారసుడిగా చూడద్దు. దాని వలన ఒక పరిమితితో కూడిన ఆలోచనలు మాత్రమే ఉంటాయని, ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటాదని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటె ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరంగల్ లో జరిగింది. ఈ వేడుకకి అక్కినేని నాగార్జున కూడా వచ్చారు. నాగార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ( Akkineni Nagarjuna’s speech about Akhil ) అభిమానులు మాతో, మా వెంట ఉన్నంత కాలమే మేము ధైర్యంగా, ఆనందంగా , బలంగా ఉంటామని చెప్పాడు. అలాగే ఇప్పడు ఈ సినిమా కోసం అఖిల్ చాల కష్టపడ్డాడని చెప్పారు. అసలు తొమ్మిది నెలల్లో ఒక మనిషి తన బాడీ లో అంత మార్పు తీసుకుని రావడం అంటే మామూలు మాట కాదని చెప్పారు.
ఇప్పడు సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ పడిన శ్రమ చూస్తే.. దేవుడా మా రోజుల్లో ఈ సిక్స్ ప్యాక్ బాధలు లేవు, అవి లేకపోయినా మా కెరియర్ బాగా సాగింది అని ఆనందించానని నాగార్జున అన్నారు. అలాగే ఇక అఖిల్ స్పై బిహేవియర్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు అఖిల్ చాలా యాక్టీవ్ గా పరుగులు పెట్టేవాడిని, అంత స్పీడ్ మాములుగా నేను ఆ ఏజ్ పిల్లలని ఎవ్వరినీ చూడలేదని.. ఒకసారి అమల డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తే.. ఆ డాక్టర్ అఖిల్ని చూసి, అమ్మా ఇతనిని రోజు మట్టిలో కొంచెం సేపు పాడుకోబెట్టండి అని చెప్పాడు. ఎందుకంటే .. ఇతని లో చాల ఎనర్జీ ఉంది భూమిలో మట్టిలో కొంచెం సేపు పడుకోబెడితే.. కొంచెం ఆ ఎనర్జీ తగ్గుతాదని చెప్పాడట. అలా అఖిల్ ఎనర్జీకి తగ్గ సినిమా ఇంతకాలని చేస్తున్నాడని.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతాడని నాగార్జున అన్నారు..