Home Cinema Star Couples: మరో బాంబు పేల్చిన వేణు స్వామి చైతు – సామ్ లా మరో...

Star Couples: మరో బాంబు పేల్చిన వేణు స్వామి చైతు – సామ్ లా మరో స్టార్ జంట కూడా విడిపోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు..

Star Couple: తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎందరో హీరో హీరోయిన్లు స్టార్ సెలబ్రిటీలు గా మారి పోతూ వాళ్ళ స్టార్డమ్ ను కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళ జాతకాలు చెబుతూ వీళ్ళ కంటే మరింత పాపులర్ అయ్యాడు వేణు స్వామి. సెలబ్రిటీ లకే సెలబ్రిటీ గా మారిపోయాడు వాళ్ళ జాతకాలు చెబుతూ.. కేవలం సెలబ్రిటీల జాతకాలే కాకుండా విడుదల అవ్వబోతున్న సినిమాల గురించి రాజకీయ నాయకుల గురించి తరచూ ఎన్నో రకాల విషయాలను వెల్లడిస్తూ వాళ్ల జాతకాలను చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వేణు స్వామి.

after-samanth-and-naga-chaitanaya-this-star-couple-from-tollywood-is-also-taking-divorce

ఇక ఆయన మొదట సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకోక ముందుకే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడిపోతారని ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయగా.. అప్పట్లో వేణు స్వామి పై తీవ్రమైన విమర్శలు చేయసాగారు. కానీ.. ఆ తర్వాత సమంత నాగ చైతన్య లు విడిపోయిన తర్వాత అందరూ ఒక్క సారిగా ముక్కు మీద వేలేసుకున్నంత పనైంది. చివరకు వేణు స్వామి చెప్పింది నిజమైంది. పట్టుమని కేవలం నాలుగు ఏళ్ళు కూడా కాపురం చేయకుండా సమంత చితులు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు వెళ్లిపోయారు.

See also  Keerthy Suresh: కీర్తి సురేష్ కు అందిన ప్రేమ లేఖ. ఎట్టకేలకు ప్రేమ గురించి అసలు నిజాన్ని బయట పెట్టింది గా ..

after-samanth-and-naga-chaitanaya-this-star-couple-from-tollywood-is-also-taking-divorce

ఆ తర్వాత వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు నిజమౌతూ వచ్చాయి. అందులో ముఖ్యంగా రష్మిక మందన గురించి చెప్పిన విషయంతో ప్రతి ఒక్కరూ వేణు స్వామి చెప్పిందల్లా నిజం అవుతుందని.. సెలబ్రిటీలు సైతం క్యూలు కడుతూ ఆయనతో పరిహార పూజలు చేయించు కోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తర్వాత టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో చనిపోతాడని కూడా చెప్పడంతో ఎవరు నమ్మక పోగా.. అతని పై తీవ్రమైన విమర్శలు చేయ సాగారు. కానీ చివరకు తారకరత్న అనూహ్యంగా గుండె పోటు తో మరణించాడు. ఇక ఈ విషయాలు కాకుండా సమంత చైతు లాగే మరొక స్టార్ హీరో హీరోయిన్లు కూడా విడిపోతారని చెప్పగా..

See also  Shruti Haasan: శృతి హాసన్ కొత్త టాటూ.. ఎక్కడ వేపించుకుందో తెలుసా.?

after-samanth-and-naga-chaitanaya-this-star-couple-from-tollywood-is-also-taking-divorce

అలాగే ఐశ్వర్య ధనుష్ లు కూడా విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మరొక హీరో హీరోయిన్లు కూడా విడిపోతారు అనే వేణు స్వామి బాంబు పేల్చడం తో ఒక్క సారిగా నెట్టింట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆది పినిశెట్టి నిక్కి గల్రాని (Star Couple) కూడా విడిపోతారని చెప్పారు. ఇక వీళ్లిద్దరి జాతకాలని క్షుణ్ణంగా పరిశీలించిన వేణు స్వామి వీళ్లిద్దరు విడిపోయేందుకు 80% వరకు అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. దాంతో వీరు కలిసి ఉండడం అసాధారణం అని వెల్లడించారు. ప్రస్తుతం వేణు స్వామి చేసినటువంటి వాక్యాలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి ట్రెడింగ్ మారుతుంది.