Home Cinema Adipurush : వివాదంలో ఆదిపురుష్.. రిలీజ్ పై అనుమానాలు.

Adipurush : వివాదంలో ఆదిపురుష్.. రిలీజ్ పై అనుమానాలు.

adipurush-in-controversy-doubts-on-release

Adipurush : ఈరోజుల్లో వస్తే అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు వస్తున్నాయి లేదా హై బడ్జెట్ తో సినిమాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సినిమాలు ఏమైనా సమస్యలు ఉన్నా, సినిమా ఫెయిల్ అయినా, బాక్సాఫీస్ ( Adipurush in controversy )  దగ్గర డబ్బు రాకపోయినా ఏదో రకంగా నిలదొక్కుకోవచ్చు. అదే హై బడ్జెట్ సినిమా సమస్యల్లో చిక్కుకున్నా, కనీసం రిలీజ్ డేట్ పోస్ట్ఫోన్ అయినా కూడా భారీ ఇంట్రెస్ట్లకు డబ్బు తీసుకొచ్చి పెట్టిన తర్వాత, అనుకున్న టైం రిలీజ్ అయ్యి అనుకున్నట్టుగా కలెక్షన్ కాకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం అందరికీ తెలిసినదే. ప్రభాస్ హీరోగా ఆది పురుష సినిమాని ఎంతో చారిత్రాత్మకంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే.

adipurush-in-controversy-doubts-on-release

ఈ సినిమాపై ఇప్పటికే అనేక వివాదాలు వచ్చాయి. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన సమయంలో కూడా ఎన్నో వివాదాలు వచ్చాయి. అన్నిటిని ఎదుర్కొని ఆది పురుష ట్రైలర్ రిలీజ్ అయ్యి.. ట్రైలర్ పాజిటివ్ గానే టాక్ ( Adipurush in controversy ) తెచ్చుకుందని ఆనందించే లోపు.. ఇప్పుడు మరొక సమస్య ఆదిపురుష్ సినిమా టీమ్ నెత్తి మీద కూర్చుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు తమకు చూపించాలని సనాతన ప్రచారకర్తలు సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు. సనాతన ప్రచారకర్తలు హైకోర్టు లాయర్ల ద్వారా సెన్సార్ బోర్డుకి లెటర్ పెట్టగా.. సోషల్ మీడియాలో ఈ లెటర్ వైరల్ అవుతుంది. ఒక సినిమా ఇంకా పూర్తికాకముందే మొదలెట్టిన దగ్గర నుంచి ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ వస్తూ ఉంటే దానివలన సినిమా టీం వాళ్లకి సినిమాకి కూడా ఎంతో నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు.

See also  Star Heroes : హవ్వా.. పెళ్లాల డామినేషన్ తో విలవిలలాడుతున్న బడా హీరోలు వీళ్లే..

adipurush-in-controversy-doubts-on-release

సాధారణంగా ఇలాంటి సమస్యల వలన సినిమా ప్రమోషన్ చాలా బాగా జరుగుతుంది కానీ ఇలాంటి ప్రమోషన్ చిన్న చిన్న సినిమాలకైతే ఉపయోగపడుతుంది కానీ, ఆదిపురుష్ సినిమాకి ఇలాంటి ప్రమోషన్స్ తో పనిలేదు. ఆ సినిమా కోసం సినీ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఆ శ్రీరామచంద్రుడు జీవిత గాధ మీద సినిమా తీయడం అంటే.. పైగా పెద్ద పెద్ద స్టార్స్ ని పెట్టి ఇంత పెద్ద బడ్జెట్ తో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా తీసేటప్పుడు.. అది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుందన్న విషయం అందరికీ తెలుస్తుంది. అందుకే సనాతన ప్రచారకర్తలు సినిమాలో ఏ సమస్య ఉన్నా, ఎలాంటి లోపం ఉన్నా ఊరుకునేది లేదని.. ఇప్పటికే పోస్టర్ విషయంలో సినిమా టీం కొన్ని తప్పులు చేసిందని.. అలా సినిమాలో క్యారెక్టర్స్ విషయంలో గానీ, దేంట్లోనైనా గాని తప్పులు ఉంటె.. శాంతి భద్రతలకు కూడా కోల్పోవాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

See also  Samantha : ఆ అనారోగ్యంతో సమంత నటనకు గుడ్ బాయ్ చెబుతూ.. కన్నీటితో ఒక్కసారి..

adipurush-in-controversy-doubts-on-release

మరి ఆదిపురుష్ సినిమా టీం వాళ్ళు ఈ కంప్లైంట్ కి ఎలా రియాక్ట్ అవుతారో? ప్రచారకర్తలను సంతృప్తి పరిచే విధంగా సమాధానపరుస్తారో? సినిమాకి రిలీజ్ ముందు వాళ్లకు సినిమా చూపిస్తారో? ఏం జరుగుతుందనేది తెలియదు. ఒకవేళ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత, సెన్సార్ బోర్డు దగ్గర రిలీజ్ ముందు వాళ్లకు చూపిస్తే.. ఒక పోస్టర్ లోనే కొన్ని తప్పులు కనిపించినప్పుడు.. సినిమా మొత్తంలో ఎన్ని కనిపించడానికి అవకాశాలు ఉంటాయో? ( Adipurush in controversy ) ఒకవేళ అలాంటి సమస్యలు ఏమైనా వస్తే జూన్ 16న రిలీజ్ కావలసిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఆగిపోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే వాళ్ల హీరో సినిమా ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా రిలీజ్ అయ్యి బాహుబలిని మించిన సక్సెస్ అవ్వాలని గ్లోబల్ లెవల్ లో ప్రభాస్ కి అవార్డ్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.