Actress Trisha Krishnan: వర్షం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ చెన్నై బ్యూటీ రావడం రావడంతోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన త్రిష తనదైన నటనతో, తన అందంతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ అభిమానులను తన సొంతం చేసుకుంది. అలా తనను సౌత్ క్వీన్ పిలుస్తూ ఉంటారు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ చెన్నై బ్యూటీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలు చేయకుండా దూరంగా ఉంది, ఆ తర్వాత ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళంలో వరస సినిమాలు చేస్తూ చాలా బిజీ బిజీగా ఉంటూ ఇక అక్కడే సెటిల్ అయిపోయింది.
ఇటీవల విడుదలయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న పొన్నియల్ సెల్వన్ లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా వివాహానికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ చెన్నై బ్యూటీ ఎందరో స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపింది ఆ తర్వాత బ్రేకప్ చెప్తూ వెళ్ళింది. ఎప్పుడు సినిమాల పరంగానే కాకుండా ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాల కారణాల వల్ల కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ట్రెండింగ్ గా ఉంటుంది. ఇక ఒకసారి త్రిష వ్యక్తిగత విషయాలలో గమనించినట్లయితే ఈమె బాయ్ ఫ్రెండ్ లిస్ట్ మామూలుగా ఉండదు..
అప్పట్లో ప్రభాస్, మహేష్ బాబు, శింబు, రానా, విజయ్ వంటి స్టార్ హీరోలతో ఈ హీరోయిన్స్ ప్రేమాయణం నడిపించింది. అలా వ్యాపారవేత్త వరుణ్ మానియాన్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు.. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ కారణం చేత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి రద్దు అవ్వడానికి కారణం ప్రముఖ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమే అట.. త్రిష తన నిశ్చితార్థం కు తెలుగు, తమిళ ఇండస్ట్రీ సెలబ్రిటీలకి ఆహ్వానం పంపింది. ఇక ఇందులో భాగంగానే ధనుష్ ని కూడా త్రిష తన ఎంగేజ్మెంట్ కు ఆహ్వానించిందట..
కానీ ధనుష్ వీరి ఎంగేజ్మెంట్ కి రావడానికి త్రిషకి కాబోయే భర్త వరుణ్ మానియానికి అస్సలు ఇష్టం లేదట.. ఎందుకంటే ఇదివరకే ధనుస్సుతో వరుణ్ కి ఓ సంఘటనలో గొడవ జరిగిందట.. దాంతో నాతో గొడవ పడ్డ వ్యక్తిని నువ్వు ఎలా పిలుస్తావని త్రిషకి కాబోయే భర్త ఆమెను నిలదీశాడట.. దీంతో ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయట.. దాంతో త్రిషకు పెళ్లి పై విరక్తి కలిగిందని ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో చాలామంది అనుకున్నారట.. ప్రస్తుతానికైతే చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకు రావడంతో వాటన్నిటిని ఖండిస్తూ త్రిష (Actress Trisha Krishnan) అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసింది