Trisha: మొదటి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ సరసన తెలుగులో వర్షంతో సూపర్ హిట్ బోనీ కొట్టింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది. తమిళ లేడి తలైవిగా పేరు తెచ్చుకుంది. మొన్నటి వరకు ఆఫర్ లేక సతమతమవుతున్న త్రిషకు పోయిన సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో పిఎస్-1 సినిమా ద్వారా మరొకసారి తనేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వెళ్లి వెత్తాయి.ఇదే క్రమంలోహీరో విజయ్ నటిస్తున్న లియో సినిమాకు త్రిష ఎంపికైంది.సెవెన్ స్క్రీన్ స్టూడియో పథాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దశకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ ఉన్నటుడైన సంజయ్ దత్ అలాగే మన్సూర్ అలీ ముఖ్యమైన పాత్రల్లో ఉండగా ఇంకో హీరోయిన్గా ప్రియ ఆనంద్ కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా నెలరోజుల షూటింగ్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం మొత్తం కశ్మీర్ వెళ్ళగా అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. దీంతో లియోచిత్ర బృందం మొత్తం చలికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు వార్తలు వచ్చాయి.దాంతో చిత్ర బృందం మొత్తం అనుకున్న సమయం కంటే త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారట. కానీ ఆ చలికి తట్టుకోలేక త్రిష అనారోగ్యానికి గురైందని ఇబ్బంది పడుతుందని అందుకే ఆమె తన చేయవలసిన పార్ట్ అక్కడ త్వరగా పూర్తిచేసుకుని తిరిగి తన స్వగృహం చెన్నైకి తిరిగి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.దాదాపు 14 సంవత్సరాల తర్వాత విజయ్ త్రిష కాంబోలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం హీరో కార్తీక్ ఖైదీ సినిమా తో లింక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.