Home Cinema Tamannaah: ఒక్క నెలలో నటి తమన్నా ఇంత సంపాదిస్తుందా.. ఈ రేంజ్ ఎవరికీ ఉండదేమో..

Tamannaah: ఒక్క నెలలో నటి తమన్నా ఇంత సంపాదిస్తుందా.. ఈ రేంజ్ ఎవరికీ ఉండదేమో..

Tamannaah Earnings: చూపు తిప్పుకోలేని అందం, అద్భుతమైన నటన , మెరుపుతీగ లాంటి నృత్యం ఇవన్నీ కలిపితే అది తమన్నా. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టి దాదాపుగా 17 ఏళ్ళు అయ్యింది. ఈ 17 ఏళ్లలో ఈమె ప్రేక్షకులకు తనలోని ఎన్నో కోణాలను చూపించింది. మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా తమన్నా, ఆ తర్వాత తమిళం లో కొన్ని సినిమాలు చేసింది.

Tamannaah-earnings

అక్కడ ఈమెకి పెద్దగా సక్సెస్ లు రాలేదు కానీ, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమా భారీ హిట్ అవ్వడం తో తమన్నా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగింది. మధ్యలో కొంతమంది కుర్ర హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చారు, కొంత మంది సక్సెస్ అయ్యి టాప్ లెవెల్ లో కొనసాగుతున్నారు, మరికొంతమంది ఎంత వేగంగా వచ్చారో, అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయారు, కానీ తమన్నా డిమాండ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు.

See also  Akhil - Sri Vishnu : అఖిల్ మిగిల్చిన బీడు భూమిని సశ్యశ్యామలం చేస్తున్న శ్రీ విష్ణు!

actress-Tamannaah-earnings

ఇప్పుడు ఆమె వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకాలం ముద్దు సన్నివేశాల్లో నటించడానికి పెద్దగా ఇష్టం చూపని తమన్నా, ఇప్పుడు ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాల్లోనే నటించేస్తుంది. ఇదంతా పక్కన పెడితే తమన్నా ఏడాది సంపాదన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా స్కేల్ ని బట్టీ ఒక్కో సినిమాకి నాలుగు నుండి ఆరు కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇప్పటికీ ఈమె సంపాదించిన ఆస్తులు మొత్తం 150 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.

See also  kamal haasan: అందుకే కమల్ హాసన్ ని చితక్కొట్టానంటున్న ఆ జంబలకడిపంబ ఎవరో తెలుసా?

actress-tamannaah

ఒక హీరోయిన్ ఈ రేంజ్ లో డబ్బులు సంపాదించడం అనేది సాధారణమైన విషయం కాదు (Tamannaah Earnings). సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో పాటుగా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ వచ్చే తమన్నా సంపాదన ఏడాదికి సగటున 20 కోట్ల రూపాయిల పైగానే ఉంటుందట. ఇక నెలకి ఆమె సంపాదన యావరేజిగా రెండు నుండి నాలుగు కోట్ల రూపాయిల మధ్యలో ఉండొచ్చు.వీటితో పాటు ఆమెకి ఖరీదైన కార్లు, బంగ్లాలు మరియు విల్లాలను కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మా బాలీవుడ్ నటుడు విజయ్ వెర్మ తో లవ్ లో ఉన్నటు మనకు తెలిసిందే. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు అని అభిమానులు అనుకుంటున్నారు.