Actress Regina: రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేని పేరు. తన కత్తి లాంటి కళ్ళతో చూపులు గుండెల్లో దించేస్తూ తెలుగు ప్రేక్షకులని ఇట్టే కట్టిపడేస్తుంది. అలాంటి రెజీనా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది మాత్రం ఎస్ఎంఎస్ అనే చిత్రం ద్వారా.. ఇక ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి ) ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ తన తొలి చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్ట లేకపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు హవా ఆ సమయంలో తగ్గలేదని చెప్పాలి. ఈ చిత్రం అనంతరం ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.
అలా వరుసగా తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి చాలా మంచి గుర్తింపుని పొందింది. ఇక ఆమె ఇటీవలే నటించిన షాకినీ డాకినీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అలా పలు చిత్రాలలో నటించి బాగా ఫేమస్ అయినప్పటికీ.. ప్రస్తుతం తెలుగులో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అలా ప్రస్తుతం అక్కడ కూడా వరుస సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అయితే ఇండస్ట్రీలో హీరోలకు అరవై ఏళ్ల వయసు పైబడుతున్న ఇంకా హీరోలు గానే నటిస్తూ ఉన్నారు తప్ప ఎవ్వరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మాత్రం కొనసాగడం లేదు.
కానీ ఇదే విషయం హీరోయిన్ లకి మాత్రం వర్తించడం లేదు. కాస్త వయసు పెరిగితే కతం సైడ్ పడేస్తున్నారు. లేదా ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ లో నటించే పాత్రలలో ఎంపిక చేసుకుంటున్నారు. దీనంతటికీ కారణం ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవ లేకపోవడమే.. కుర్ర హీరోయిన్లు ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతో పాత హీరోయిన్ల పని కతం అయిపోతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అసలు రెజీనా కసాండ్రా కి మొదటి నుండి హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కనేదట.. గ్లామర్ ప్రపంచంలో రాణించి తనేంటో నిరూపించుకోవాలని ఎంతో ఉత్సాహపడేదట.. కానీ మొదట్లో సినీ ఇండస్ట్రీ గురించి తెలియని రెజీనా కసాండ్రా సన్నీలియోన్ లాంటి ఓ పెద్ద స్టార్ పర్న్ స్టార్ గా ఎదగాలని చెప్పేదట.
ఆ తర్వాత కొన్నాళ్లకు ప.ర్న్ స్టార్ అంటే ఏంటో తెలుసుకున్న రెజీనా షాక్ కు గురైందట.. ఇక అప్పటి నుండి తను నటించే సినిమాలకు కండిషన్లు పెట్ట సాగింది. ఇక బోల్డ్ సీన్స్ విషయంలో అందరి హీరోయిన్స్ కంటే కాస్త డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే అక్కడ చేసేదంతా కల్పితంగా ఉన్నప్పుడు అలాంటి సీన్లు చేయడంలో పెద్ద తప్పేమీ కాదు అంటూ వెల్లడించింది. దాంతో ఒక్కసారిగా రెజీనా కసాండ్రా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వ సాగాయి. దాంతో ఇంకేముంది మీ మీమర్స్ రాయుళ్ళకి పని దొరికింది ఆమెను తెగ ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఏది ఏమైనా ఏ హీరోయిన్ చెప్పలేని విషయాన్ని నిర్మూహమాటంగా రెజీనా (Actress Regina) చెప్పిందని మెచ్చుకోవాలి.