Actress Raasi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగిన రాశి గురించి మనందరికీ తెలిసినదే. బదిలీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశికి మొదటి సినిమాతో ( Actress Raasi had a love affair ) పెద్ద పేరు రాలేదు కానీ, ఆ తర్వాత శుభాకాంక్షలు, గోకులంలో సీత, ప్రేయసి రావే, పెళ్లి పందిరి ఇలాంటి సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఆ రోజుల్లో రాశి గోకులంలో సీతలో పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతూ నటించింది.. ఆ సినిమాని ఇప్పటివరకు కూడా అభిమానులు మర్చిపోలేక పోతున్నారు. అలాగే శుభాకాంక్షలు లో ఆమె చాలా మంచి క్యారెక్టర్ చేసి.. మంచి పేరు సంపాదించుకుంది. ఇక ప్రేయసి రావే సినిమాలో శ్రీకాంత్ ని డామినెటే చేస్తూ.. ఇరగదీసింది. చిన్నప్పుడు బాలనటిగా సినిమాల్లో నటించిన రాశి.. పెద్దయిన తర్వాత ఇలాంటి సినిమాల్లో సక్సెస్ అవుతూ ఉంటే..
శ్రీదేవిలా ఈమె కూడా చిరకాలం స్టార్ హీరోయిన్గా నిలబడి పోతుందని స్టార్టింగ్ లో అనుకునేవారు. కానీ రాశి అంతవరకు రీచ్ కాలేకపోయింది. కారణం ఆమె ఎదుగుతున్న కొద్ది.. ఆమె బరువు పెరగడం, ఇంకా ఆమె సెలెక్ట్ చేసుకునే ( Actress Raasi had a love affair ) సినిమాలు, క్యారెక్టర్స్ లో లోపం ఉండటం వల్ల నెమ్మదిగా ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయింది. రాశి కొంతకాలం తర్వాత ఐటెం సాంగ్స్ లో నటించడం నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా నటించడం చేసింది దానితో పూర్తిగా కనుమరుగైపోయిందని అనుకోవచ్చు. ఏదేమైనా ఏ రంగంలోనైనా సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి చాలా సహజమే కానీ అసలు రాశి సినిమా రంగాన్ని పూర్తిగా ఎందుకు వదిలేసింది అనే దానిపై ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు కానీ అవి వింటే బాధగానే అనిపిస్తుంది.
రాశి 17 ఏళ్ల వయసులోనే ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత ఆమె తండ్రి మరణం తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఆ మొదటి భర్తని వదిలేసి.. తర్వాత సినిమాల్లో బిజీ అయ్యి.. తర్వాత ఇంకొక పెళ్లి కూడా చేసుకొని అతనికి కూడా విడాకులు ఇవ్వడం జరిగిందట. అయితే రాశి రెండవసారి సినిమాల్లో రీ ఎంట్రి ఇచ్చి ( Actress Raasi had a love affair ) తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి.. మళ్లీ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి.. చాలా ప్రయత్నించింది. అదే ప్రయత్నంలో ఆమె రెండోసారి సినిమాల్లో చేసినప్పుడు రాజేంద్రప్రసాద్ సరసన కొన్ని సినిమాలు నటించింది. ఆ క్రమంలో రాజేంద్రప్రసాద్ తో ఆమెకు కొంత స్నేహం ఏర్పడింది. వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా మాట్లాడుకునే వారంట.. దానిమీద కూడా వాళ్ళిద్దరికీ అఫైర్ ఉందని అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయట.
ఒక స్నేహితుడితో సరదాగా మాట్లాడినా కూడా.. ఒక స్నేహబంధంతో ఇద్దరు కలిసి తిరిగినా కూడా ఇలాంటి ప్రచారాలు జరగడంతో రాశికి విసుగు పుట్టిందట. అసలు నిజం కానీ ఇలాంటి వార్తని ప్రచురిస్తూ ఉంటే ఆమెకి సినిమా రంగంపై విరక్తి పుట్టి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గుడ్ బాయ్ చెప్పేసింది అంట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ, పెళ్లయింది కనుక ఆవిడ సినిమా రంగానికి గుడ్ బాయ్ చెప్పి ఉండొచ్చు కూడా.. ఇలాంటి ప్రచారాలకు విసుగు పుట్టే ఆమె సినిమా రంగానికి గుడ్ బాయ్ చెప్పి ఉంటే మాత్రం నిజంగా అది బాధాకరమే. ఏదేమైనా రాసి ఇప్పుడు తన భర్తతో, ఒక పండంటి బిడ్డను కనీ.. వాళ్ళిద్దరితో చాలా హ్యాపీగా బ్రతుకుతుందని అంటున్నారు. ఇప్పుడు ఆమె బుల్లితెర పై సీరియల్స్ లో నటిస్తుంది.