Home Cinema Manchu Lakshmi: హాలీవుడ్ యాక్షన్ హీరో తో మంచి లక్ష్మీ ప్రసన్న పెళ్లి.? షాక్ లో...

Manchu Lakshmi: హాలీవుడ్ యాక్షన్ హీరో తో మంచి లక్ష్మీ ప్రసన్న పెళ్లి.? షాక్ లో టాలీవుడ్ 

Actress Manchu Lakshmi: మంచు మోహన్ బాబు నట వారసురాలిగా మంచు లక్ష్మీ ప్రసన్న ‘అనగనగ ఒక ధీరుడు’ అనే చిత్రం ద్వారా విలన్ రోల్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. తొలిసినిమాలోనే అద్భుతంగా నటన కనబర్చి తండ్రికి తగ్గ తనయురాలు అని అనిపించుకుంది.

actress-manchu-lakshmi-should-have-married-that-popular-star-hero-but-mohan-babu-rejected-him

ఇక ఆ సినిమా తర్వాత ఈమె టాలీవుడ్ లో ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చెయ్యగలను అని నిరూపించుకుంది. నటన లో తండ్రి మోహన్ బాబు తర్వాత తన ఫ్యామిలీ లో తానే నెంబర్ 1 అని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది కూడా. కేవలం నటిగా మాత్రమే కాదు బుల్లితెర మీద పలు టీవీ షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో టాక్ షోస్ కూడా నిర్వహించింది. అంతే కాదు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించి సక్సెస్ లను అందుకుంది.

See also  Vijay Devarakonda - Sreeleela : విజయ్ దేవరకొండ పెట్టిన ఆ మెస్సేజ్ కి రగిలిపోయి ఫోన్ తో అలాంటి పని చేసిన శ్రీలీల..

actress-manchu-lakshmi-should-have-married-that-popular-star-hero-but-mohan-babu-rejected-him

ఇకపోతే ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే అమెరికా లో చదువుకుంటున్న రోజుల్లోనే మంచు లక్ష్మీ ప్రసన్న ఒక హాలీవుడ్ చిత్రం లో నటించిందట. అలాగే నేను హాలీవుడ్ లో కొనసాగి ఉంటే నేడు అక్కడ స్టార్ హీరోయిన్ ని అయ్యేదానిని, అనవసరం గా టాలీవుడ్ లోకి వచ్చాను అని మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన ఆమె మాటలు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. అంతే కాదు, తానూ చదువుకుంటున్న రోజుల్లో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ని ఎంతగానో ఇష్టపడేదానిని అని, అప్పటికీ ఆయన ఇంకా స్టార్ కాలేదని, ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అనే విషయం అందరికీ తెలిసిందే అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రసన్న. (Actress Manchu Lakshmi)

See also  Aishwarya Rai : త్వరలో ఐశ్వర్య విడాకులు.. కారణం ఆ మాజీ ప్రేమికుడే అంటూ గుసగుసలు.

actress-manchu-lakshmi-should-have-married-that-popular-star-hero-but-mohan-babu-rejected-him

ఒకవేళ నేను హాలీవుడ్ లో కొనసాగి ఉంటే ఈ రోజు టామ్ క్రూజ్ ని పెళ్లి చేసుకునే దానిని ఏమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మంచు లక్ష్మీ ఇలా మాట్లాడడం, సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్ల్స్ రావడం అనేది కొత్తేమి కాదు. సోషల్ మీడియా లో ఆ ట్రోల్ల్స్ ని కూడా నేను ఎంజాయ్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చే లక్ష్మీ కావాలనే ఇలాంటి కామెంట్స్ చేస్తుందా అని అంటున్నారు ఫ్యాన్స్.