Home Cinema Honey Rose: హనీ రోజ్ కోసం సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తున్న కుర్రకారులు.! కారణం...

Honey Rose: హనీ రోజ్ కోసం సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తున్న కుర్రకారులు.! కారణం ఏమిటంటే.?

Actress Honey Rose: నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీర సింహారెడ్డి లో నటించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ కేవలం తన నటనతోనే కాకుండా అందంతో తెలుగు ప్రేక్షకులనే కాక కుర్రకారులకు సైతం నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ మలయాళీ పొన్ను హనీ రోజ్.. తెలుగులో గత సంవత్సరం విడుదలైన బాలకృష్ణ చిత్రం వీర సింహ రెడ్డి లో నటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ అమ్మడి పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఏ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలన్న టక్కున వాళ్ళందరికీ హాని రోజ్ గుర్తుకు వస్తుందట.. అందుకే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిప దాదాపు అతి పెద్ద షాపింగ్ మాల్ లను పదికి పైగా తను ఓపెన్ చేసింది.

See also  Kajal Agarwal: ఆ టాలీవుడ్ హీరో తో కాజల్ అగర్వాల్ నిజంగే ఎఫైర్ నడిపిందా..?

actress-honey-rose-super-craze-fans-want-her-in-all-movies

ఈ క్రమంలోనే తన పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మార్మొగి పోతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినబడుతుంది. ఆ రేంజ్ లో హ్యూజ్ ఫాలోయింగ్ కేవలం ఒకే ఒక్క సినిమా వీర సింహారెడ్డి తో కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో తన పర్ఫామెన్స్ తో పాటు డాన్స్ కూడా అదరగొట్టి తెలుగు కుర్రాళ్ళను సైతం తన వైపుకు తిప్పేసుకుంది. ఇక ఇప్పటి కుర్రాళ్ళకు అసలు విషయం తెలియదు.. ఈ మలయాళీ పొన్ను (Actress Honey Rose) ఈ చిత్రంతోనే టాలీవుడ్ దో అడుగుపెట్టిందని అందరూ అనుకుంటున్నారు. అదేం కాదురా అబ్బాయిలు.. తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం 2008 సంవత్సరంలోనే ఆలయం అనే చిత్రం ద్వారా తెలుగులో తెరగెట్రం చేసింది.

See also  Gopi Chand: ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ ఆమెను పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.??

actress-honey-rose-super-craze-fans-want-her-in-all-movies

ఇక ఆ తర్వాత 2014వ సంవత్సరంలో ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంలో నటించి తన అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకుంది. ఇక ఇక్కడ ఈ రెండు చిత్రాల్లో నటించినప్పటికీ తనకు లక్కు అనేది కలిసి రాక మళ్ళీ తిరిగి మలయాళం లో వరుస చిత్రాల్లో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఎనమిది ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం అవడంతో తెలుగులో కూడా హనీ రోజ్ కు మంచి ఫాలోయింగ్ పెరిగి అవకాశాలతో పాటు క్రేజ్ కూడా తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎవరైనా తన గురించి మాట్లాడుకుంటే వీర సింహారెడ్డి చిత్రం ముందు ఆ తర్వాత అనే మాట్లాడుకుంటున్నారు.

See also  Sushant Singh Rajput : మిస్టరీగా మిగిలిన సుశాంత్ సూసైడ్ పై క్లారిటీ ఇచ్చిన అతని ప్రేయసి రియా చక్రవర్తి..

actress-honey-rose-super-craze-fans-want-her-in-all-movies

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె జోరు కొనసాగుతుందని చెప్పాలి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రకారుల మతులు పోగొడుతూ వాళ్ళ గుండెల్ని పిండి పడేస్తుందట.. ఇక తెలుగులో ఆమె హవా కొనసాగడం ఖాయమని.. రానున్న రోజుల్లో స్టార్ హీరోల సినిమాల జాబితాలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె తన తదుపరి చిత్రం ఏంటనేది ఇక ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా.. ఇక్కడ కుర్రకారులు మాత్రం ఆమెను తెర పై చూడాలని తెగ ఆరాటపడుతున్నారని మాత్రం అర్థం అవుతుంది. అందుకోసమే సోషల్ మీడియాలో ఆమెతో సినిమా తీయాలంటూ కుర్రోళ్ళు మాత్రం తెగ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో..