Home Cinema SreeLeela: అందరి ముందు శ్రీలీల పరువు మొత్తం తీసేసిన హైపర్ ఆది..

SreeLeela: అందరి ముందు శ్రీలీల పరువు మొత్తం తీసేసిన హైపర్ ఆది..

SreeLeela: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమంలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల గురించి ఎంత చెప్పిన అది తక్కువే..తన మొదటి సినిమా పెళ్లి సందడితో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మాస్ మహా రాజా రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటించి భారీ విజయాన్ని తన కైవసం చేసుకుని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అయితే ఈ అమ్మడు చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉండడం గమనార్ధం.. స్టార్ హీరోల మొదలు కుర్ర హీరోల వరకు అందరితో కూడా సినిమాల చేయడానికి పచ్చ జెండా ఊపింది శ్రీ లీల.. (Sreeleela got trolled)

sreeleela-got-trolled-by-hyper-aadi-on-stage-infront-of-everyone

ప్రస్తుతం ఎంతోమంది ప్రేక్షకుల కలల రాకుమారిగా మారడమే కాకుండా హీరోలకు కూడా కలల రాకుమారిలా, స్వప్న సుందరిల మారిపోయింది శ్రీలీల.. ఎందుకంటే ఆమె నటించిన ఏ చిత్రమైన సక్సెస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది షాకింగ్ కామెంట్లు చేస్తూ ఆమె పరువు మొత్తం తీసి గంగలో కలిపే విధంగా మాట్లాడాడు.. ఇక దాని గురించే మాట్లాడటం కోసం మన టాపిక్ లోకి వెళ్లినట్లయితే.. శ్రీ లీల తండ్రి తాగడం గురించి కూడా మాట్లాడుతూ.. ఎవరు ఊహించని సంచలనమైన వాఖ్యలు చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇటు వెబ్ మీడియాలో కూడా హైపర్ ఆది మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

See also  Srikanth: ప్రాణభయంతో శ్రీకాంత్ అమెరికా పారిపోవడానికి ఆ సినిమా ఎలా కారణం అయ్యిందో మీకు తెలుసా?

sreeleela-got-trolled-by-hyper-aadi-on-stage-infront-of-everyone

తాజాగా శ్రీ లీల డి 15 ఛాంపియన్ బాటిల్ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక శ్రీలీల పాల్గొన్న ఈ ఫైనల్ ఎపిసోడ్ మే 31 వ తారీకున ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ లో శ్రీలీల డాన్స్ తో సూపర్ గా అదరగొట్టి దంచి పడేసిందని చెప్పాలి. దాంతో యాంకర్ ప్రదీప్ నీకు డాన్స్ కి ఎంత దగ్గర సంబంధం ఉందని శ్రీ లీల అని అడగ్గా.. ప్రదీప్ అడిగిన ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే డాన్స్ తో ఎనలేని సంబంధం ఉంది. అప్పటికే నడవడానికి కూడా రాని వయసు నాది.. అయినప్పటికీ మా అమ్మ నన్ను డాన్స్ క్లాస్ కు పంపేది.

See also  Srihari: ఇన్నాళ్లకు బయటపడటం నిజం.. రెండుసార్లు పెళ్లి చేసుకున్న శ్రీహరి!

sreeleela-got-trolled-by-hyper-aadi-on-stage-infront-of-everyone

ఇక ఆ డాన్స్ వల్ల నా కాళ్ళకి బొబ్బలు వస్తే అమ్మపై కోపగించుకునే దాన్ని.. డాన్స్ వద్దు ఏమి వద్దు స్కూల్ కి పంపండి అని చెప్పేదాన్ని అంటూ.. శ్రీ లీల సమాధానం చెప్పగా. ఇదే ప్రశ్న హైపర్ ఆదిని ప్రదీప్ అడగ్గా పరువు తీసేలా కామెంట్లు చేశాడు. శ్రీ లీల చెప్పిన సమాధానాన్ని ఆయన కూడా సిల్లిగా చెబుతూ.. మూడేళ్లప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పెట్టేవారు డాన్స్ నేర్చుకోరా అని.. నాకు కూడా ఒళ్ళంతా బొబ్బలు వచ్చేది. అయితే మా నాన్న ఇంటికి వచ్చాక స్కూల్ కి వెళ్తాను అని ఇది నా వల్ల కాదని చెప్పాను. కానీ ఆయన మందు ఓ పెగ్గు వేసి ఊగుతాడు అదే డాన్స్ అంటాడు అంటూ ఘోరాతి ఘోరంగా శ్రీ లీల చెప్పిన మాటలను స్ఫూఫ్ చేస్తూ కామెడీ పంట పండించాడు. (Sreeleela got trolled)