Home Cinema Teja : బాలకృష్ణతో గొడవ.. ఎన్టీఆర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న తేజ..

Teja : బాలకృష్ణతో గొడవ.. ఎన్టీఆర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న తేజ..

director-teja-fight-with-bala-krishna-what-really-happened

Director Teja : తెలుగు సినిమా రంగానికి ఎందరో మంచి మంచి హీరోలను పరిచయం చేసి.. సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుల్లో తేజ ఒకరు. తేజ చేసిన సినిమాలు లో ఉండే లవ్ ఫీలింగ్ యూత్ కి చాలా నచ్చుతుంది. పెళ్లి కాకముందు ప్రేమించుకోవడం, ఇద్దరి యంగ్ స్టర్స్ మధ్యనుండే ప్రేమ ఇవన్నీ తేజ ( Director Teja fight with ) ఎంత బాగా చూపిస్తాడో.. అలాగే నేనే రాజు నేనే మంత్రి లో ఒక భార్యని భర్త ప్రేమించే విధానం ఎంతో అద్భుతంగా చూపించాడు తేజ. అటువంటి తేజ ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ.. అహింస అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా జూన్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

director-teja-fight-with-bala-krishna-what-really-happened

ఈ సినిమా ప్రమోషన్ కోసం మొత్తం భారం అంతా తేజ పైనే పడినట్టుంది. ఎందుకంటే హీరో కొత్త అవ్వడం వలన ప్రమోషన్ కి హీరో ఏం మాట్లాడినా కూడా అంత తొందరగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళదు కనుక.. అదే తేజ ఏమైనా మాట్లాడితే అది బాగా ప్రమోషన్ అవుతుంది. ఆ తరుణంలోనే తేజ అనేక ఇంటర్వ్యూల్ని ( Director Teja fight with ) ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా గురించి మాత్రమే కాకుండా.. అనే పర్సనల్ విషయాలు, అనేక ఇతర హీరోల గురించి, ఆయన సినిమా కెరియర్ లో జరిగిన ఎన్నో విశేషాలు గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఉదయ్ కిరణ్ గురించి ఆయన కొన్ని ప్రశ్నలకు సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం మిస్టరీ తనకు తెలుసని ఎప్పటికైనా చనిపోయేలోపు ఆ విషయం చెప్పే తాను చనిపోతానని ఆయన అనడం ఒక సెన్సేషన్ గా మారింది.

See also  అవతార్-2 అనుకున్నది సాధించినది.

director-teja-fight-with-bala-krishna-what-really-happened

అలాగే తేజ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణకి తేజకి మధ్య గొడవలు ఉన్నాయని ఎప్పటినుంచో కొన్ని వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. దాని గురించి తేజ క్లారిటీ ఇచ్చారు. నాకు బాలకృష్ణకి ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు. నేను ఆయనతో ఎటువంటి గొడవ చేయలేదు. కాకపోతే సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని ( Director Teja fight with ) నాకు ఎప్పటినుంచో కల. ఆ సినిమా చేసేందుకు నేను మొదలు పెట్టాను కూడా కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో సినిమా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే నాకు బాలకృష్ణకి ఏదో ఒక గొడవ జరిగిందని.. మేమిద్దరం గొడవల్లో ఉన్నామని.. అనేక రకాలుగా ఊహించుకొని వార్తలు రావడం జరిగింది. కానీ అందులో ఎటువంటి నిజం లేదని తేజ స్పష్టంగా చెప్పారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ ని నేను ఎప్పటికైనా తీస్తానని.. దాన్ని అలా వదిలేయనని..

See also  Hyper Aadi: హైపర్ ఆదిని ఇరకాటంలో పెట్టిన పవన్ కళ్యాణ్.. పాపం ఆది పరిస్థితి?

director-teja-fight-with-bala-krishna-what-really-happened

కాకపోతే ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు తీసేంత సామర్థ్యం నాకు లేదని.. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలంటే చాలా సామర్థ్యం కావాలని చెప్పారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బయోపిక్ ని ఒక సినిమాలా తీయలేకపోయినా.. కనీసం ఒక వెబ్ సిరీస్ గా నైనా ఆయన కంటెంట్ ని తీయాలని.. తప్పకుండా తీస్తానని చెప్పారు. అయితే నందమూరి అభిమానులు.. తేజ నిజంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుకుంటే.. జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి తీయొచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గా బాగా సూట్ అవుతాడా అంటే.. యంగ్ ఏజ్ లో బాగా సూట్ అవుతాడు కానీ, ఓల్డ్ అయ్యే కొద్దీ సూట్ అవుతాడా అని కొందరు అనుకుంటే.. యంగ్ ఏజ్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి.. ఓల్డ్ ఏజ్ లో బాలకృష్ణ ని పెట్టి తీస్తే బాగుంటుందని ఇంకొందరు అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ వెబ్ సీరిస్ లో నటించిన అవకాశం ఉందా? ఇదంతా జరిగే పనేనా అని ఇంకొందరు నెటిజన్లో కామెంట్ చేసుకుంటున్నారు.