Home Cinema Priyanka Chopra: ఆ స్టార్ డైరెక్టర్ అందరిముందే నన్ను ఏకంగా అది విప్పమని అడిగాడు. షాకింగ్...

Priyanka Chopra: ఆ స్టార్ డైరెక్టర్ అందరిముందే నన్ను ఏకంగా అది విప్పమని అడిగాడు. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియాంక చోప్రా..

Priyanka Chopra: ప్రియాంక చోప్రా గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఆమె ఇండియా లెవెల్లో బాలీవుడ్, టాలీవుడ్ లో క్రేజ్ మాత్రమే సంపాదించకుండా చివరికి హాలీవుడ్ లో కూడా తనెంటో నిరూపించుకుని తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ తో హీరోగా తుఫాన్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతో అలరించింది. ప్రస్తుతం ఎక్కువగా హాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఆ మధ్యనే ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలై చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇలాంటి ప్రియాంక చోప్రా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుపుతుంది. (Priyanka Made Shocking Comments)

See also  Hi Nanna Trailer Review : హాయ్ నాన్న ట్రైలర్ చూస్తే ఆ పాపులర్ సీరియల్ లో సీన్స్..

priyanka-chopra-made-shocking-comments-on-the-star-director

ప్రియాంక చోప్రా తన కంటే పది సంవత్సరాల వయసు చిన్నోడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అందరిని షాక్ కు గురి చేసింది. ఇదే కాకుండా నిక్ జోనాస్ తో కలిసి సరోగసి ప్రాసెస్ ద్వారా ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ 2000 వ సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కూడా గెలుచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. మిస్ వరల్డ్ టైటిల్ ఎప్పుడైతే ఆమెను వరించిందో అప్పటి నుంచి బాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు తీయడానికి తెగ ఆరాటపడుతూ ఉండేవారు. అలా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చాలా బిజీగా మారిపోయింది. (Priyanka Made Shocking Comments)

priyanka-chopra-made-shocking-comments-on-the-star-director

ఇక ప్రియాంక చోప్రా ఇటీవలే ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో జరిగిన చేదు అనుభవాన్ని తన మాటల్లో చెప్పకు వచ్చింది. ఇదే విషయంలో ఆమె మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో అప్పటికి కొత్త అప్పుడప్పుడు సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. కానీ ఓ చిత్రంలో నటించేటప్పుడు నేను అండర్ కవరేజెంట్ పాత్రలో చేస్తున్నాను. దాంతో ఆ షూటింగ్లో భాగంగా ఓ వ్యక్తిని ట్రాప్ చేయడానికి నేను డాన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ డాన్స్ చేసే సమయంలో నా శరీరంపై ఉన్న బట్టలన్నీ తీసేయమని దర్శకుడు తెలిపాడు. ఒక్క నూలుపోగు ఉండకూడదని అన్నాడు. చివరికి ఆ డైరెక్టర్ నా స్టైలిష్ తో చెప్పి అండర్ వేర్ కనబడేలా చూపించమన్నాడంటూ చెప్పడంతో నేను ఒక్కసారి అయోమయానికి గురయ్యాను.

See also  Puri Jagannadh - Ram : పూరి-రామ్ సినిమా లో సంచలనం కలిగించే పాయింట్.

priyanka-chopra-made-shocking-comments-on-the-star-director

ఆ డైరెక్టర్ ఏకంగా అలాంటి సన్నివేశం ఉంటేనే నీకు సినిమాల్లో మంచి గుర్తింపు వస్తుందని.. ఆ డైరెక్టర్ నన్ను ఒత్తిడి కూడా చేశాడు. కానీ ఆ డైరెక్టర్ ఆలా మాట్లాడేసరికి ఒక్కసారిగా నాకు ఎనలేని కోపం చిర్రెత్తుకు వచ్చేసింది. కానీ ఆ సమయంలో నేను ఏం చేయాలో తెలియక ఆ డైరెక్టర్ ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోయాను. ఇక ఆ తర్వాత నేను ఈ చిత్రాలో నటించనని ఆ చిత్రం నుంచి తిరిగి వచ్చేసాను. కానీ ఆ తర్వాత తెలిసింది నేను ఆరోజు చాలా పెద్ద తప్పు చేశానని. ఎందుకంటే.. నీను ఆ టైంలో భయపడి ఏమి అనకుండా వచ్చాను. కానీ అదే రోజు ఆ డైరెక్టర్ కి గట్టి వార్నింగ్ ఇస్తే బాగుండు అని ఆ తర్వాత అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పు అదొక్కటే అంటూ ప్రియాంక చోప్రా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది.