Home News Mobile recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ లో 28,56,84 రోజులే ఉండటం వలన ఎన్ని...

Mobile recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ లో 28,56,84 రోజులే ఉండటం వలన ఎన్ని వేల కోట్లు లూటీ అంటే..

comments-on-mobile-recharge-plans

Mobile recharge : ఈరోజుల్లో మొబైల్ లేని వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే గుర్తించడం కష్టమే. పైగా ఒక్కోరు రెండూ, మూడు మొబైల్స్ వాడతున్నారు. రీసంట్ గా కేంద్ర సమాచార శేఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ( Comments on Mobile Recharge ) భారత దేశంలో 120 కోట్లకి పైగా ఆక్టివ్ మొబైల్ యూజర్స్ ఉన్నారు అంట. వీళ్లు అందరూ మొబైల్ రీఛార్చ్ చేసుకోకతప్పదు కదా. అదీ కాక జియో రంగప్రవేశం చేశాక ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వాడకం ఏరేంజిలో ఉందొ మన అందరికీ తెలుసు. ఒకప్పుడు 250 రూపాయలు పెట్టి రీఛార్చ్ చేస్తే 30 రోజులు వాలిడిటీ , 30 రూపాయలు టాక్ టైం వచ్చేది. ఆతరువాత 250కి రీచార్జ్ చేస్తే 250 టాక్ టైం వచ్చేది. 30 రోజలు వాలిడిటీ ఉండేది.

See also  IRCTC: రూ 905 తో 7 ముఖ్యమైనవి చూసే బంపర్ ఆఫర్ ఇస్తున్న ఇండియన్ రైల్వే.. వివరాలు ఇవే..

comments-on-mobile-recharge-plans

ఆతరువాత అన్లిమిటెడ్ టాక్ టైం, 30 రోజుల వాలిడిటీ వచ్చాక జనాలు ఎదురుగా మనుషులతో మాట్లాడటం మానేసి ఫోన్లో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారు. జియో ప్రవేశం ఇంటర్నెట్ వాడకం పెరిగాక జనాలు ఆ ఫోన్లో కూడా మాట్లాడటం మానేసి ఆఫోన్ కి 24 గంటలు చూడటం అలవాటు పడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే ( Comments on Mobile Recharge ) అదొక వ్యసనంగా మార్చుకుని జీవితాలని సైతం నాశనం చేసుకుంటున్న పరిస్థితి. ఈ విషయంలో యూత్ ఇంకా పాడయిపోతున్నారు. చదువుకుని జీవితాలను చక్కదిద్దుకోవాల్సిన సమయంలో.. చేతిలో ఫోన్ పెట్టుకుని.. దానితోనే అనవసరమైన చాటింగ్స్, మాటలు, వీడియోలు చూడటం. గేమ్స్ ఆడటం చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

comments-on-mobile-recharge-plans

మొబైల్ వాడకం ఇప్పటి జనరేషన్ లో చాలా అవసరమే. అది లేకపోతే ఎన్నో ముఖ్యమైన ఆగిపోవడమే, ఆలస్యం అవ్వడమే, ఇబ్బంది పెడటమో జరుగుతుంది. అలాగని దానిని మంచికి కాకుండా చెడుకి, మన జీవితంలో విలువైన సమయాన్ని పాడు చెయ్యడానికి.. మొబైల్ ఎక్కువమంది ఎక్కువగా వాడక తప్పడం లేదు. ఆన్లైన్ గేమ్, సినిమాలు, యాప్ లు , సీరియల్స్, చాటింగ్స్,సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఉంటాయి. ఏదైనా ( Comments on Mobile Recharge ) కొత్త టెక్నాలజీ మన అందుబాటులోకి వచ్చిందంటే.. అది మన జీవితానికి ఎలా ప్లస్ అయ్యేలా వాడాలా అని చూడాలి, ఆ పరంగానే నేర్చుకోవాలి గాని, ఇంకొక రకంగా వాడి లైఫ్ లో చాలా విలువైన కాలాన్ని పాడుచేస్తే.. కాలం మన జీవితాన్ని పాడుచేసే పరిస్థితి వస్తాది. ఇదో రకమైన నష్టమైతే..

See also  OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

comments-on-mobile-recharge-plans

గతంలో మాదిరిగా మొబైల్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వాలిడిటీ కాకుండా 28,56,84 ఇలా అర్ధం పర్ధం లేని రోజుల వాలిడిటీ ఇస్తున్నారు మొబైల్ నెట్వర్క్ వాళ్ళు.. దీనివలన సంవత్సరానికి 12 సార్లు చేయాల్సిన రీఛార్జ్ కాస్త 13 సార్లు చేయాల్సి వస్తోంది. కనీసం నెలకి సరాసరి 250 రూపాయలు ఒక్కో మొబైల్ కి ఎక్సట్రాగా మనం కట్టిన 120కోట్ల మొబైల్స్ నుండి ఒక్కొక్కరి నుండి 250 రూపాయల లూటీ అంటే ఎన్ని వేలకొట్లో ఒకసారి ఆలోచించండి.. ఇక్కడ ప్రతి ఒక్కరూ మనిషి రక్తాన్ని డబ్బు రూపంలో అనేక రకాలుగా పీల్చేస్తున్నారు. వీళ్లేనా అంటే.. కాదు.. బ్యాంకింగ్ రంగం నుండి ఎన్ని హిడన్ చార్జస్ ! ఇలా ప్రతి రంగంలోని వాళ్లు జనాలకి నొప్పి తెలియకుండా జలగల్లాగా మన రక్తం తాగుతున్నాయి.