Niharika Comments: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయమైన ఏకైక అమ్మాయి మెగా డాటర్ నిహారిక కొణిదెల.. మొదట తన జీవితాన్ని యాంకర్ గా కొనసాగించిన నిహారిక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఒక మనసు చిత్రంతో పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఓ రెండు మూడు సినిమాల్లో నటించింది. ఇక వివాహమనంతరం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన నిహారిక మొట్ట మొదటిసారి పెళ్లి తర్వాత ఆమె నటించింది ఓ వెబ్ సిరీస్లో.. ఇక ఈ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ రీ యంట్రి ఇవ్వబోతుంది నిహారిక. ఇక ఈ వెబ్ సిరీస్ ఆదిత్య మండల దర్శకత్వం వహించాడు.
ఇందులో నిహారిక గాయత్రి అనే ప్రధానమైన పాత్రను పోషించనున్నది. మరదే విధంగా ముఖ్యమైన ఇతర పాత్రలలో వైవా హర్ష, అక్షయ్ లింగస్వామి, సాయి రోనక్ మొదలైన వారు ఉండనున్నారు. బ్రిటిష్ వెబ్ సిరిస్ ఆధారణంగా ఈ డెడ్ పిక్సెల్ ని రూపొందించారు.. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన ఈ సిరీస్ 19వ తారీకున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నది. కొంతమంది యువతీ యువకులు వీడియో గేమ్ ఆడుతూ అందులో మునిగిపోతూ అసలు ఈ లోకాన్ని మరిచిపోతారు. ఆ తర్వాత అసలు వాళ్లు ఎలాంటి సంఘటనలు వాళ్ల జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుందో..
దానికి సంబంధించిన కథ ఈ వెబ్ సిరీస్..ప్రస్తుతం నిహారిక కొనిదెల ఈ వెబ్ సిరీస్ ని ప్రమోషన్ చేయడంలో భాగంగా చాలా బిజీ బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది నిహారిక. ఇక చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత నిహారిక ఈ వెబ్ సిరీస్ ద్వారా రియంట్రీ ఇవ్వడంతో.. ఈ వెబ్ సిరీస్ కి హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక సడన్ గా తన నోరు జారుతూ.. మెగా కుటుంబం పరువు తీసింది. అసలు ఏమైంది.. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఇటీవలే పాల్గొన్నావో ఇంటర్వ్యూలో యాంకర్ మెగా హీరోలు కాకుండా మీకు బాగా నచ్చిన టాలీవుడ్ హీరో ఎవరని ప్రశ్నించింది..
ఆ ప్రశ్నకు నిహారిక (Niharika Comments) సమాధానం చెబుతూ.. నాకు టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన నటన అన్నా చాలా ఇష్టమని తెలిపింది. దాంతో అక్కడితో వదిలేయకుండా.. ఎన్టీఆర్ లాంటి ఆల్ రౌండర్ టాలీవుడ్ లో నేటితరం హీరోల్లో ఎవ్వరు ఉండరు. ఆయన ప్రతి సినిమా మిస్ కాకుండా చూస్తా అంటు నోరు జారింది. నిజానికి మెగా హీరోలైన రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ కి మాత్రం తీసిపోరు. అలాంటిది నిహారిక ఎన్టీఆర్ ముందు వాళ్ళిద్దరు కూడా వేస్ట్ అన్నట్లు మాట్లాడింది. అలా మాట్లాడడంతో ప్రస్తుతం నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారడమే కాకుండా మెగా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.