Home Cinema Sharwanand Wedding: అక్కినేని అఖిల్ లాగే శర్వానంద్ పెళ్ళి ఆగిపోనుందా.? ఫుల్ క్లారిటీ ఇచ్చిన శర్వా...

Sharwanand Wedding: అక్కినేని అఖిల్ లాగే శర్వానంద్ పెళ్ళి ఆగిపోనుందా.? ఫుల్ క్లారిటీ ఇచ్చిన శర్వా టీం..

Sharwanand Wedding: ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న శర్వానంద్ తను ఎంతగానో ప్రేమించిన రక్షిత రెడ్డిని ఇరు కుటుంబంలో పెద్దలను ఒప్పించి మరి జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళుతుందని ఎప్పటి నుంచో అందరి నోటా వినిపిస్తున్నప్పటికీ వాటన్నిటికీ ఏమాత్రం క్లారిటీ తెలుపకుండా సడన్ గా ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇక రక్షిత రెడ్డి విషయానికొస్తే తను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. మరదే.. విధంగా రక్షిత రెడ్డి యొక్క తండ్రి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గారైన మధుసూదన్ రెడ్డి.. ఇదే కాకుండా ఏపీ మాజీ మంత్రి అయినటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మనవరాలు కూడా.

See also  Rajamouli - Jr NTR : రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో..

sharwanand-wedding-got-cancelled-and-his-team-gave-reason-for-it

ఇక వీళ్లిద్దరి ప్రేమ విషయానికొస్తే చాలా సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా ప్రేమించుకుని చివరికి ఇరు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని భావించారట.. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరు ఎంతో సింపుల్ గా జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీళ్ళ నిశ్చితార్థ వేడుకకు రామ్ చరణ్ ఉపాసన దంపతులు.. మనదే విధంగా సిద్ధార్థ అతిధిరావు హైదరి తదితరులు హాజరయ్యారు.. ఇక ఇప్పుడు అసలు ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అదేంటంటే.. ఐదు నెలలు దాటినా కూడా ఇప్పటివరకు తన పెళ్లి డేట్ ఎందుకు ప్రకటించలేదు.? శర్వానంద్.! అనేది అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న..

See also  Balakrishna: బాలకృష్ణ నిజంగా అలాంటి పాపం చేశాడా?

sharwanand-wedding-got-cancelled-and-his-team-gave-reason-for-it

దాంతో అక్కినేని అఖిల్ లాగే శర్వానంద్ కూడా తన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంటున్నాడా.? అందుకే ఇప్పటివరకు పెళ్లిరోజు ఎప్పుడు అనేది ప్రకటించడమే లేదా.. అని సోషల్ మీడియాలో కుప్పలు దిబ్బలుగా ఒక వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో ఈ వార్తలకి శర్వానంద్ టీం క్లారిటీ ఇచ్చి పులిస్టాప్ పెట్టారు. శర్వానంద్ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకోలేదని త్వరలోనే వీళ్లిద్దరూ వివాహం చేసుకుంటారని దానికి కారణం ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడని ఇక ఈ చిత్రం పూర్తయ్యాక శర్వానంద్ మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడుస్తారని తెలిపారు..

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

sharwanand-wedding-got-cancelled-and-his-team-gave-reason-for-it

ఈ చిత్రం నేపథ్యంలోనే ఇటీవలే నలబై రోజులు లండన్ లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ప్రస్తుతం శర్వానంద్ కుటుంబం మొత్తం.. రక్షిత రెడ్డి కుటుంబం మొత్తం.. కూడా హైదరాబాదులోనే ఉన్నారని.. వీరి ఇరు కుటుంబాలు పరస్పరం వీళ్ళ వివాహ వేడుక గురించే చర్చలు జరిపిస్తున్నారని వీరి పెళ్లి ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు అనే దాని గురించి స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు శర్వానంద్ టీం.. ఇక శర్వానంద్ ఆయన వివాహం (Sharwanand Wedding) గురించి క్లారిటీ తెలియడంతో శర్వానంద్ పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.