సినిమా రంగంలో అత్యంత ఖరీదైన పెళ్ళిళ్ళు చేసుకుంది వీళ్ళే.
ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్
2018 డిసెంబర్ 1న ప్రియాంక చోప్రా – నిక్కీ జోనాస్ లు ఇద్దరు ఒక్కటయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆశ్చర్య పడేలా మూడు రోజుల పెళ్ళి భోద్ పూర్ లో ఓ ఖరీదైన ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
సినిమా ఇండస్ర్టీలో అత్యంత ఖరీదైన పెళ్ళిగా వీళ్ళ జంట నిలిచింది. వీళ్ళ రాయల్ వెడ్డింగ్ ఖర్చు 105 కోట్లకు పైమాటే. . . .
దీపికా పదుకునే – రణ్ వీర్ సింగ్ :
దీపికా పదుకునే రణ్ వీర్ సింగ్ ఆరేళ్ళ పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత నవంబర్ 14, 2018లో వివాసం చేసుకున్నారు.
వీరు ఇటలీలోని లేక్ కొమోలో తమ వివాహం సన్నిహిత స్నేహితులు మరియు బంధువుల మధ్య జరిగింది. దీపికా – రణవీర్ ల వివాహనికి అయిన ఖర్చు 95 కోట్లు.
విరాట్ కోహ్లీ – అనుష్క:
విరాట్ కోహ్లీ అనుష్క జంట అంటే విరాట్ కోహ్లీ అభిమానులకు ఇటు క్రికెట్ ప్రేక్షకులందరికీ అటు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సుపరిచితమైన జంట.
వీళ్లు అత్యంత గ్రాండ్ గా ఇటలీలో వీరి వివాహాన్ని అత్యంత దగ్గర స్నేహితులు, ఆప్తులు, బంధువులు వీరి వివాహానికి హాజరై వివాహాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు.
వీళ్ళ వివాహం డిసెంబర్ 11 2017న జరిగింది. ఈ వివాహానికి మొత్తం ఖర్చు 90 కోట్లు
ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ :
ఐశ్వర్యరాయ్ అంటేనే ఫ్యాన్స్ కి ఓ పండుగ అలాంటి ఐశ్వర్య అని పెళ్లాడింది అభిషేక్ బచ్చన్. వీరు ముంబైలోని 20 ఏప్రిల్ 2007 రోజున వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చేసిన ఖర్చు 40 కోట్లు.
శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా :
నవంబర్ 22 2009 న రాజ్ కుంద్రా శిల్పా శెట్టి వివాహ బందంతో ఒక్కటయ్యారు.
వీరి వివాహనికి అక్షరాల అయిన ఖర్గు 80 కోట్లు. రాజ్ కుంద్రా ప్రేమించి శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నాడు.