Home Cinema Comedian Manobala: ప్రముఖ స్టార్ కమెడియన్ మనోభాల మృతి.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..

Comedian Manobala: ప్రముఖ స్టార్ కమెడియన్ మనోభాల మృతి.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..

Comedian Manobala: మనోబాల పూర్తి పేరు బాలచందర్.. ఆయన 1953 వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున మరుంగూర్, కన్య కుమారి తమిళనాడులో జన్మించారు. తెలుగు ప్రేక్షకుల కంటే తమిళ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు మనోబాల. ఈయన ఒక హాస్య నటుడే కాక దర్శకుడు అలాగే ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి నటుడు మనోబాల.. ఇవాళ తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చేరిన ఆయన గత కొంతకాలం నుంచి వైద్యం తీసుకుంటున్న మనోభాల ఇవాళ మధ్యాహ్నం ఇవాళ అనగా బుధవారం మధ్యాహ్నం మరణించాడు.

See also  Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

famous-star-comedian-manobala-passed-away

తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటుండగా తన తుది శ్వాస విడిచాడు. ఇక మనోబాల తమిళ ప్రేక్షకులకి కాక తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే.. ఇక తమిళంలో హిట్ అయిన ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగులో ప్రేక్షకులు చెంత చేరడంతో ఈయన మనకు పరిచయమయ్యాడు. మనోబాల తన కామెడీ తో అందరికీ దగ్గరవుతూ చాలా ప్రసిద్ధి చెందిన హాస్యనటుల్లో ఈయన ఒకరు. మరి అదే విధంగా చెప్పాలంటే తమిళ స్టార్ హీరోల చిత్రాలలో మనోభాల కచ్చితంగా ఉంటాడు.

famous-star-comedian-manobala-passed-away

తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం ఎలా స్టార్ హీరోల సరసన ఖచ్చితమైన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అలా మనోభాల తమిళ స్టార్ హీరోల చిత్రాలు నటిస్తూ ఉంటాడు. ఇక రజనీకాంత్, విజయ్ ఇలా ఎందరో స్టార్ హీరోల చిత్రాల అన్నిట్లో కలిసి ఈయన నటించారు. ఈయన మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రమైన విషాదఛాయలు ఏర్పడ్డాయి. ఇక మన టాలీవుడ్ విషయానికి వచ్చినట్లయితే ఈయన నటించి మంచి పేరు తెచ్చుకున్న చిత్రాల్లో మహానటి, దేవదాస్, రాజ్ దూత్ వంటి చిత్రాల్లో ఈయన నటనతో అందరినీ మెప్పించారు.

See also  Jabardast Hari: జబ్బర్దస్థ్ హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో కీలకమైన నిజాలు..

famous-star-comedian-manobala-passed-away

ఆ మధ్య విడుదల యిన వాల్తేరు వీరయ్య చిత్రంలో కూడా న్యాయమూర్తిగా మనకు కనిపించారు. 1970 వ సంవత్సరంలో సినీ ఇతర పరిశ్రమలో అడుగుపెట్టిన మనోబాల 1979లో భారతి రాజు వద్ద సహాయ దర్శకుడుగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత దర్శకునిగా ఎదిగి ఇరవై కి పైగా చిత్రాలను నిర్మించాడు. మనోభాల దాదాపు 350 కంటే ఎక్కువ చిత్రాల్లో సహ నటుడుగా నటించిన ఈయన అందర్నీ మెప్పించాడు. ఇక ఆ తర్వాత మనోభాల (Comedian Manobala) ఇటు వెండి తెరలోనూ అటు బుల్లి తెరలోనూ నటించి అందరూ అభిమానుల్ని తన సొంతం చేసుకున్నాడు..