Sai Dharam Tej Remuneration: మెగా మేనల్లుడు గా తెలుగు సినీ చలనచిత్ర రంగంలో అడుగు పెట్టాడు సాయి ధరమ్ తేజ్. తన మొదటి సినిమా పిల్ల నువ్వు లేని జీవితం తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.. సాయి ధరం తేజ్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కొడుకు.. ఇదే కాకుండా చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబులకు వరుసకు మేనల్లుడు.. రామ్ చరణ్, వరుణ్ తేజ్ వీళ్లిద్దరూ వరుసకు బావలవుతారు. ఇక సాయిధరమ్ తేజ్ ఇటీవలే విడుదలైన తన చిత్రం విరూపాక్ష తో ప్రేక్షకులని పలకరించాడు. ఇక ఈ చిత్రం కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించగా..
ఇందులో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించినది. ఈ చిత్రం ఏప్రిల్ 21 తారీఖున విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని బాక్సాఫీస్ వసూలను కొల్లగొడుతూ ప్రస్తుతం ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. తాను పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరమైన షాకింగ్ కామెంట్స్ తెలిపాడు. రెమ్యూనరేషన్ ఇచ్చే ప్రక్రియలో నిర్మాతలు తేజ్ ను చాలా దారుణంగా మోసం చేశారట.
ఇప్పటివరకు సాయంత్రం తేజ్ తాను సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన అప్పటినుంచి పది హేను సినిమాలు చేస్తే ఒక నిర్మాత తప్ప మిగిలిన వారు ఎవరు వాళ్లు చెప్పిన మొత్తం రెమ్యూనరేషన్ తేజ్ కి ఇవ్వలేదట.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఇస్తామనుకున్న అమౌంట్ కు ఎంతో కొంత కట్ చేసేవారట.. ఇక ఇదే విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. కానీ తేజ్ రెమ్యూనరేషన్ గురించి ఏనాడు పెద్దగా ఆలోచించలేదట.. మంచి స్టోరీ వస్తే తప్పకుండా సినిమా చేస్తానని భావించేవాడట.. ఇక తేజ్ పది హేను సినిమాలో నటిస్తే పదునాలుగు సినిమాలలోని నిర్మాతలు.
ఎవరు ఫుల్ అమౌంట్ (Sai Dharam Tej Remuneration) అనుకున్నది అనుకున్నంత ఇవ్వలేదట. కొన్ని చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచినప్పుడు కూడా ముందుగా ఇస్తా అన్న రెమ్యూనరేషన్ కంటే తక్కువగానే ఇచ్చేవారట.. ప్రామిస్ చేసినప్పటికీ అనుకున్నంత ఇవ్వలేదట.. కానీ ఒకే ఒక్క సినిమాకు ఫుల్ రెమ్యూనరేషన్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమానే జవాన్.. జవాన్ ప్రొడ్యూసర్ కృష్ణ ముందుగా తాను చెప్పినట్లే మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఫుల్ ఇవ్వలేదు. కానీ నేనెవర్ని బ్యాలెన్స్ ఇవ్వమని ఇంతవరకు అడగలేదు.. అంటూ తేజ్ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం తేజ్ మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.