Home Cinema Bramhaji: మామూలోడు కాదుగా బ్రహ్మాజీ.. ఆ యంగ్ హీరోయిన్ తో అలా చేస్తూ అందరికీ...

Bramhaji: మామూలోడు కాదుగా బ్రహ్మాజీ.. ఆ యంగ్ హీరోయిన్ తో అలా చేస్తూ అందరికీ దొరికిపోయాడు గా..

Brahmaji: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ. తన నటనతో.. చిలిపితనంతో.. కామెడీ కౌంటర్లు, సెటైర్లు వేసే ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు. ఇక ఆయన విషయంలో సోషల్ మీడియా వేదిక అయినా స్టేజి వేదిక మీదైనా ఆయన వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు. ఎప్పుడు తనకు అవసరం లేని వాటిలో తలదూరుస్తూ ఉంటాడు. ఆ మధ్య అనసూయ ఆంటీ వివాదం ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు.. ఇక దాని గురించి కౌంటర్ గా బ్రహ్మాజీ నన్ను అంకుల్ అంటే పోలీస్ కేసు పెడతా అంటూ ట్వీట్ చేసి అందరికీ షాక్ కు గురి చేశాడు.

See also  Pooja Hegde : త్రివిక్రమ్ లో ఆ బుద్దిని బట్టబయలు చేసిన పూజా హగ్దే !

brahmaji-caught-with-that-heroine-doing-that-silly-thing

మరదే విధంగా దాంతోనే ఆగకుండా సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయితే దానిని కచ్చితంగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఓం రౌత్ ను ప్రభాస్.. కం టు మై రూమ్ అన్న పదం ఎంత సంచలనాలు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని కూడా బ్రహ్మాజీ ఇమిటెడ్ చేస్తూ సుమ షో లో పాల్గొన్నప్పుడు సుమ.. కం టు మై రూమ్ అంటూ చేసిన నానా హంగామా అంతా ఇంత కాదు. అయితే ప్రస్తుతం తాజాగా విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ కూడా ఆయన ఏడిపించారు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట తెగ రచ్చ చేస్తుంది.

brahmaji-caught-with-that-heroine-doing-that-silly-thing

ఇక విరూపాక్ష చిత్ర విషయానికి వస్తే సాయి ధరం తేజ్, సంయుక్త మీనన్ జంటగా కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ నెల 21 వ తారీకున ఈ చిత్రం మనందరి ముందుకు రాబోతోంది. రోజు రోజుకీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టారు మేకర్స్. నిన్ననే ఈ చిత్రం యొక్క ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అందరికీ ట్రైలర్ బాగా నచ్చడమే కాకుండా ఆకట్టుకుంటుంది. ఇందులో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ కి కూడా మంచి పేరు వచ్చింది. దాంతో సంయుక్త తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ మొదలుపెట్టింది.

See also  Archana: ఆ హీరోయిన్ వల్లే నా సినీ కెరియర్ ఇలా నాశనం అయిపోయిందంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన అర్చన..

brahmaji-caught-with-that-heroine-doing-that-silly-thing

ఇక ట్విట్టర్ లో ఆమె చేసిన ట్వీట్ విరూపాక్ష ట్రైలర్ ఎలా ఉంది అని ఆమె అడగగా అభిమానులతో పాటు బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. ట్రైలర్ నచ్చిందా చెప్పండి అన్న ప్రశ్నకు.. చాలా బాగుంది ప్లాటినం లెగ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు బ్రహ్మాజీ (Brahmaji). దీంతో సంయుక్త మీనన్ అరే ఏంటి బ్రమ్మి గారు అంటూ సిగ్గు మొగ్గలు వేసింది. టాలీవుడ్ ఎంట్రీ తోనే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్, బిబిసారా, సార్ ఇలా వరుస హిట్లను అందుకోవడంతో బ్రహ్మాజీ గోల్డెన్ లెగ్ అనే దాని బదులు ప్లాటినం లెగ్ అన్నాడు.. ఇక ఈ రిప్లై చూసిన అభిమానులు అన్న హీరోయిన్ తో పులిహోర కల్పిస్తున్నావు గా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.